నిహారిక పెళ్లి కార్డు వెరీ కాస్ట్‌లీ గురూ!  

మెగా డాటర్.నాగబాబు ముద్దు బిడ్డ నిహారిక కొణిదెల పెళ్లి సంగతి తెలిసిందే.

TeluguStop.com - Niharika Konidela Wedding Invitation Was Very Costly

ఈ నెల 9వ తేదీన డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది అన్న విషయం ఇప్పటికే తెలుసు.వీరి పెళ్లి అంగరంగ వైభంగా చేసేందుకు సర్వంసిద్ధం చేస్తున్నారు మెగా బ్రదర్స్.

గుంటూరు ఐజీ జె.ప్రభాకర్ రావు తనయుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యతో నిహారిక పెళ్లి జరగనుంది.ఈ పెళ్ళికి సంబంధించిన పెళ్లి కార్డు వచ్చేసింది.పెళ్లి రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరగనుండగా రిసెప్షన్‌ హైదరాబాద్‌లోని జె.ఆర్.సి.కన్వెన్షన్ సెంటర్‌లో డిసెంబర్ 11న జరగనుంది.

TeluguStop.com - నిహారిక పెళ్లి కార్డు వెరీ కాస్ట్‌లీ గురూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

నాగబాబు చెప్పినట్టు హీరో వరుణ్ తేజ్ నిహారిక పెళ్లి పనులు అన్ని దగ్గరుండి చూసుకుంటున్నాడు.

ఆగస్టులో నిహారిక, చైతన్య నిశ్చితార్థం జరగగా ఈ నెల 9వ తేదీన వివాహం జరుగుతుంది.గత నాలుగు నెలల నుంచి పెళ్లి ఎక్కడ చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేవి అన్ని కూడా హీరో వరుణ్ తేజ్ చూసుకుంటున్నారు.

ఇక ఈ నేపథ్యంలోనే నిహారిక, చైతన్య వివాహ ఆహ్వాన పత్రిక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కాగా మెగా డాటర్ గా పరిచయమైనా నిహారిక మొదట యూట్యూబ్ లో ముద్దపప్పు ఆవకాయ సిరీస్ తీసి ఆతర్వాత బుల్లితెరపై ఢీ కి హోస్ట్ గా వ్యవహరించి ఆతర్వాత వెండితెరపై ఒక మనసు సినిమాతో హీరోయిన్ గా పరిచయం తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.ఏది ఏమైనా మెగా డాటర్ నిహారిక పెళ్లి ఓ రేంజ్ లో జరుగుతుంది.వెడ్డింగ్ కార్డు మాత్రం చాలా కాస్టలీగా డిజైన్ చేయించారు.

డెస్టినేషన్ వెడ్డింగ్ కావడం వల్ల అతి తక్కువ కార్డులు ప్రింట్ చేయించినట్టు రిచ్ లుక్ ఉండేలా చేసినట్టు సమాచారం.మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఆ వెడ్డింగ్ కార్డును మీరు ఓసారి చూసేయండి!

.

#Wedding Card #Nagababu #Varun Tej #IGJ. #J.R.C.At

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు