అన్నయ్య కాళ్లు పట్టుకుని బతిమిలాడా.. అప్పుడు ఒప్పుకున్నాడు

మెగా డాటర్‌ నిహారిక వరుసగా చిత్రాలు చేస్తూ బిజీ అవుతుంది.ఒక మనసు చిత్రంతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ మెగా డాటర్‌ ఆ చిత్రంతో కమర్షియల్‌ సక్సెస్‌ను మాత్రం దక్కించుకోవడంలో విఫలం అయ్యింది.

 Niharika Konidela Wants A Chance For Saira Narasimhareddy-TeluguStop.com

దాంతో కాస్త గ్యాప్‌ తీసుకుని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో ఉన్న ‘హ్యాపీ వెడ్డింగ్‌’ అనే చిత్రాన్ని ఈ అమ్మడు చేసింది.సుమంత్‌ అశ్విన్‌ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది.

ఇక ఈ చిత్రంతో పాటు సైరా నరసింహారెడ్డి చిత్రంలో కూడా నిహారిక కనిపించబోతున్నట్లుగా ఇన్నాళ్లు ప్రచారం జరిగింది.ఆ విషయమై తాజాగా క్లారిటీ వచ్చేసింది.

‘హ్యాపీవెడ్డింగ్‌’ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా నిహారిక మీడియాతో మాట్లాడుతూ తాను సైరాలో నటిస్తున్నట్లుగా క్లారిటీ ఇచ్చేసింది.ఇలా వచ్చి అలా వెళ్లి పోయే పాత్ర కాకుండా ఒక మంచి పాత్రలో, నిడివి ఎక్కువగా ఉండే పాత్రలోనే తాను కనిపించబోతున్నట్లుగా చెప్పుకొచ్చింది.నిహారిక ఆ చిత్రంలో స్ధానం దక్కించుకునేందుకు చాలా ప్రయత్నం చేసిందట.మొదట పెదనాన్న చిరంజీవిని అడగగా ఆయన నిర్మాత మరియు దర్శకుడిని అడగాల్సిందిగా చెప్పాడట.అప్పుడు సైరాకు నిర్మాత అయిన రామ్‌ చరణ్‌ వద్దకు నిహారిక చేరింది.

‘సైరా’ చిత్రంలో నిహారిక నటించాలని ఉందంటూ చెప్పగానే రామ్‌ చరణ్‌ వద్దని సున్నితంగా తిరష్కరించాడట.

నీకు సూట్‌ అయ్యే పాత్ర లేదు అంటూ చెప్పే ప్రయత్నం చేశాడట.కాని నిహారిక మాత్రం చరణ్‌ను బతిమిలాడి, బుజ్జగించి, చివరకు కాళ్లు కూడా పట్టుకుని సైరాలో స్థానం దక్కించుకుందట.

సైరా చిత్రంలో కనిపించడం వల్ల తన కెరీర్‌కు ఖచ్చితంగా ఉపయోగదాయకం అని నిహారిక భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.అందుకే అంతగా అన్నయ్యను బతిమిలాడి ఈమె ఆ చిత్రంలో స్ధానం దక్కించుకుంది.

సైరా చిత్రం కేవలం తెలుగులోనే కాకుండా తమిళం మరియు హిందీలో కూడా విడుదల కాబోతుంది.అందుకే అక్కడ కూడా తనకు గుర్తింపు వస్తుందనే ఉద్దేశ్యంతో నిహారిక సైరాలో ఉండాలని గట్టిగా కోరుకుంది.మెగా డాటర్‌ తల్చుకుంటే కానిది ఏముంది, అనుకున్నట్లుగానే సైరాలో స్ధానం దక్కించుకుంది.సైరా చిత్రంలో నిహారిక ఒక బోయ పిల్లగా కనిపించబోతుందని, చిరంజీవి పెంపుడు కూతురుగా కనిపించే అవకాశం ఉందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube