ఆ సీక్రెట్ చెప్పనంటున్న నిహారిక.. ఏం జరిగిందంటే..?

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక, చైతన్యల వివాహం గత నెల 9వ తేదీన వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.పెళ్లికి ముందు నుంచి ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉన్న నిహారిక ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా కీలక విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

 Niharika Konidela Suspense On Her  Secret, Goes Viral, Instagram Post, Niharika-TeluguStop.com

తాజాగా నిహారిక ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఒక పోస్ట్ చేయగా ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.నిహారిక నోటిపై వేలు వేసుకున్న ఫోటోను షేర్ చేస్తూ నేను ఒక సీక్రెట్ ను చెప్పనని పేర్కొన్నారు.

ఒకవేళ ఆ సీక్రెట్ ను చెబితే అది సీక్రెట్ ఎలా అవుతుందని జోసెఫ్ రాధిక్ కు మాత్రమే ఆ సీక్రెట్ తెలుసని పేర్కొన్నారు.జోసెఫ్ రాధిక్ నిహారిక, చైతన్యల పెళ్లి ఫోటోలు తీసిన ఫేమస్ పోటోగ్రాఫర్ అని తెలుస్తోంది.

మరి ఆ సీక్రెట్ ఏంటో జోసెఫ్ రాధిక్ చెబుతారేమో చూడాల్సి ఉంది.నిహారిక సీక్రెట్ చెప్పకుండా టెన్షన్ పెడుతున్నారని సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

మరోవైపు పెళ్లి తరువాత వెబ్ సిరీస్ లలో నటిస్తూ నటిగా నిహారిక మళ్లీ బిజీ అవుతున్నారు.గతంలొ నిహారిక నటించిన పలు వెబ్ సిరీస్ లు సక్సెస్ అయిన సంగతి తెలిసిందే.ఈ వెబ్ సిరీస్ లో నిహారికతో పాటు అనసూయ కూడా నటిస్తూ ఉండటం గమనార్హం.అత్తారింటి నుంచి నటించడానికి ఎటువంటి అభ్యంతరం లేదని తెలుస్తోంది.ప్రస్తుతం వెబ్ సిరీస్ లలో నటిస్తున్న నిహారిక భవిష్యత్తులో సినిమాల్లోకి కూడా రీఎంట్రీ ఇస్తారేమో చూడాల్సి ఉంది.

భర్తతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేయడంతో పాటు అప్పుడప్పుడూ కవితలు కూడా రాస్తూ ఆ కవితలను నిహారిక సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

నిహారిక సీక్రెట్ ఫోటోగ్రాఫర్ కు మాత్రమే తెలుసని పోస్ట్ చేయగా చైతన్యకు ఆ సీక్రెట్ తెలుసో లేదో అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube