మెగా డాటర్ విన్యాసాలు మాములుగా లేవుగా.. స్కైడైవింగ్ వీడియో వైరల్!

Niharika Konidela Sky Dive In Spain Tour With Her Husband

మెగాస్టార్ కొణిదెల నిహారిక ప్రస్తుతం స్పెయిన్ లో తన భర్త చైతన్యతో కలసి విహరిస్తోంది.ఈ దంపతులు ఇద్దరూ కలసి అక్కడ వెకేషన్ ను ఎంజాయ్ చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చేస్తూ ఉన్నారు.

 Niharika Konidela Sky Dive In Spain Tour With Her Husband-TeluguStop.com

మరి కొద్ది రోజులలో ఈ జంట పెళ్లి అయ్యి ఏడాది కానున్న సందర్భంగా ప్రస్తుతం వీరు స్పెయిన్ లో విహరిస్తున్నారు.ఈ క్రమంలోనే స్పెయిన్ రాజధాని బార్సీలోనాలో పర్యటిస్తున్నారు.

ఈ క్రమంలోనే నిహారిక ఒక సాహసం చేసింది.అదేమిటంటే స్పెయిన్‌లో స్కై డైవింగ్ చాలా ఫేమస్.

 Niharika Konidela Sky Dive In Spain Tour With Her Husband-మెగా డాటర్ విన్యాసాలు మాములుగా లేవుగా.. స్కైడైవింగ్ వీడియో వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

యూరప్‌లోనే ది బెస్ట్ స్కైడైవింగ్‌గా స్కైడైవ్ స్పెయిన్ ను చెప్పుకుంటారు.ఈ స్కైడైవింగ్‌ను నిహారిక కొణిదెల కూడా ఎంజాయ్ చేశారు.

ఈ మేరకు తన స్కైడైవింగ్ సంబంధించిన వీడియోను నిహారిక సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఈ వీడియోలో మొదట నిహారిక కాస్త టెన్షన్ పడినట్టుకనిపించింది.

ఆ తరువాత ధైర్యం తెచ్చుకొని స్కై డ్రైవింగ్ చేస్తూ గాలిలో తంబ్స్ అప్ చూపించారు.మొత్తానికి సహాయకుడితో కలిసి విమానంలో నుంచి దూకేశారు.

ఆకాశం నుంచి భూమి మీదకి డైవ్ చేసిన తరవాత నిహారిక ఆనందం అంతా ఇంతా కాదు.

మొత్తానికి ఒక కొత్త అనుభూతిని నిహారిక స్కైడైవింగ్ ద్వారా పొందినట్లు తెలుస్తోంది.టాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్,అంజలి, కళ్యాణి ప్రియదర్శన్ ఇంకా పలువురు హీరోయిన్ లు స్కైడైవ్ చేశారు.బాలీవుడ్ నుంచి అయితే దీపికా పదుకొనె, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఊర్వశి రౌతెలా తదితరులు స్కైడైవ్‌ను ఆస్వాదించారు.

ఇప్పుడు వారి జాబితాలో నిహారిక కూడా చేరారు.

ఈ టూర్‌లో నిహారిక అన్నం తినడం కంటే ఎక్కువగా ఫోన్ చూడటానికే సరిపోతుందంటూ, కొన్ని మిలియన్ ఏళ్ల తర్వాత కూడా నిహారిక అలాగే ఫోన్ చూసుకుంటూ ఉంటుందంటూ రీసెంట్‌గా ఓ ఫొటోను చైతన్య షేర్ చేసిన సంగతి తెలిసిందే.ఇక మెగా అభిమానులు ఈ దంపతులకు ముందుగానే పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

#Sky Dive #Niharika #Barcelona #Spain #Chaitanya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube