మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం తన భర్త జొన్నలగడ్డ చైతన్యతో కలిసి విదేశాల్లో విహరిస్తుంది.పెళ్లి అయ్యి ఏడాది అయిన సందర్భంగా ఈమె తన భర్తతో కలిసి విదేశాల్లో విహరిస్తూ అక్కడి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తోంది.
అయితే వీరు అక్కడికి చైతన్య, నిహారిక డిసెంబర్ నెల ఆరంభంలో వెకేషన్ ను ప్లాన్ చేసుకొని వెళ్లారు.అప్పటినుంచి నిహారిక విదేశాల్లో చక్కర్లు కొడుతూనే ఉంది.
స్పెయిన్,బార్సిలోనా అంటూ అక్కడ విహరిస్తూ నిహారిక ఫుల్ హల్ చల్ చేస్తోంది.అందుకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంది.
ఇకపోతే నిహారికకి ఫుడ్ అంటే చాలా ఇష్టం అన్న విషయం అందరికి తెలిసిందే.తినడం ఎంత ఇష్టమో అలాగే వంటలు కూడా ప్రయోగాలు చేసి మరీ నిహారిక వండుతూ ఉంటుంది.
తాజాగా నిహారిక వీడియోని షేర్ చేసింది.అందులో వెయిట్ లాస్ అవుతుంటే ఫుడ్ వ్యాల్యూ తెలిసిందని, అప్పుడే తిన్నా కూడా వెంటనే ఆకలి వేస్తుంది అంటూ ఇంగ్లీష్ లో ఉన్న ఒక పాటను బ్యాక్ గ్రౌండ్ లో ప్లే చేస్తూ రకరకాల ప్లేస్ లో రకరకాల ఫుడ్ లను తింటున్న వీడియోలను నిహారిక షేర్ చేసింది.
అలా ఆ వీడియోలో ఆమెకు ఫుడ్ అంటే ఎంతో ఇష్టమని చెప్పకనే చెప్పేసింది.
ఎవడి ప్రాబ్లమ్స్ వాడికి ఉంటాయ్.ఎవడి గోల ఆడిది.అంటూ నిహారిక వీడియోని షేర్ చేసింది.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంటు చేయగా వాటిని చూసి నవ్వేసుకుంటున్నారు నాకు ఇది ఎంతో నచ్చింది ఫుడ్ ఇస్ లైఫ్ అంటూ రీతూవర్మ టి ఆర్అయింది.
ఇక ఈ వీడియోని చూసిన నెటిజన్లు నిహారిక పై ఈటింగ్ మిషన్ అంటూ సెటైర్లు వేస్తున్నారు.