స్పెయిన్ ను చుట్టేస్తున్న నిహారిక జంట.. పిక్స్ వైరల్!

Niharika Konidela Share Spain Vacation Photos

మెగా డాటర్ నిహారిక కొణిదెల ప్రెసెంట్ తన భర్తతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది.మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన ఏకైక హీరోయిన్ గా నిహారిక గుర్తింపు తెచ్చుకుంది.

 Niharika Konidela Share Spain Vacation Photos-TeluguStop.com

ఈమె తన నటనతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్న కమర్షియల్ గా మాత్రం హిట్ అందుకోలేక పోయింది.ఇక గత ఏడాది డిసెంబర్ 9న ఐటి ఉద్యోగి చైతన్య జొన్నలగడ్డను వివాహమాడి ఒక ఇంటి కోడలు అయి పొయింది.

కరోనా టైం లో జరిగిన ఈ వేడుకలో మెగా ఫ్యామిలీతో పాటు అతి కొద్దీ మంది బంధుమిత్రుల మధ్య నిహారిక, చైతన్య ఒక్కటయ్యారు.ఇక తాజాగా నిహారిక- చైతన్య ఫస్ట్ యానివర్సరీ రాబోతున్న నేపథ్యంలో రెండు వరాల ముందుగానే నిహారిక కపుల్ వెకేషన్ కు చెక్కేశారు.ఇక పెళ్లి రోజు వరకు ఈ వెకేషన్ ను ఫుల్ గా ఎంజాయ్ చేయబోతున్నారు ఈ క్యూట్ కపుల్.

 Niharika Konidela Share Spain Vacation Photos-స్పెయిన్ ను చుట్టేస్తున్న నిహారిక జంట.. పిక్స్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వీరిద్దరూ కలిసి వెకేషన్ కోసం స్పెయిన్ వెళ్లినట్టు తెలుస్తుంది.

బార్సెలోనా లోని ప్లెసెంట్ ప్లేసెస్ అండ ఫుడ్ ను ఎంజాయ్ చేస్తూ వాటికీ సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది నిహారిక.ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈమె కెరీర్ విషయానికి వస్తే పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా నిర్మాతగా కూడా మంచి సినిమాలు తీయాలని నిహారిక కోరిక.

అలా తన కోరికను నిజంగా మార్చుకోవడానికి అంత సిద్ధం చేసుకుంది.నిహారిక ఇప్పటికే పింక్ ఎలిఫాంట్ పేరుతో ఛానల్ స్టార్ట్ చేసి వెబ్ సీరీస్, షార్ట్ ఫిల్మ్‌లు నిర్మించింది.ఇక ఈ మధ్యనే నిహారిక నిర్మించిన ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ అనే కామెడీ వెబ్ సిరీస్ ను రిలీజ్ చేసారు.జీ5 లో స్ట్రీమింగ్ అయినా ఈ సిరీస్ కు ఆడియెన్స్ నుండి మంచి స్పందన లభించింది.ఇక త్వరలో మరొక రెండు ప్రాజెక్ట్స్ తో నిహారిక నిర్మాతగా రాబోతున్నారు.

https://www.instagram.com/stories/highlights/18144450952230065/
#Spain

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube