వైరల్ అవుతున్న మెగా డాటర్ ఫోటో షూట్…  

Niharika Konidela Mega Heroine - Telugu Mega Heroine, Niharika Konidela, Photo Shoot, Tollywood, Web Series

మెగాస్టార్ చిరంజీవి  ఫ్యామిలీ నుంచి తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం అయినటువంటి నిహారిక కొణిదెల గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే మెగాస్టార్ కాంపౌండ్ నుంచి వచ్చినటువంటి హీరోలు సినీ పరిశ్రమలో అదరగొడుతుంటే హీరోయిన్ నిహారిక మాత్రం అంత ఆశాజనకంగా తన సినీ కెరీర్ ని రాణించలేక పోతోంది.

 Niharika Konidela Mega Heroine

దీనికి తోడు ఈ అమ్మడు నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేక పోవడంతో అవకాశాలను దక్కించుకో లేకపోతుంది.దీంతో ఈ అమ్మడు ఈ మధ్య ఫోటో షూట్లతో అవకాశాలను దక్కించుకునే ప్రయత్నాలు చేస్తోంది.

తాజాగా ఓ ప్రముఖ ఫోటోషూట్ సంస్థ నిర్వహించినటువంటి ఫోటోషూట్ కార్యక్రమంలో పాల్గొంది.అనంతరం తన ఫోటోలను సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా నెటిజన్లతో పంచుకుంది.అయితే ఈ ఫోటోలలో నిహారిక కొంతమేర అందాలు ఆరబోసినట్లు తెలుస్తోంది.దీంతో పలువురు నెటిజన్లలో అవకాశాలకోసం గ్లామర్ డోస్ పెంచిందంటూ కామెంట్లు చేస్తున్నారు.

వైరల్ అవుతున్న మెగా డాటర్ ఫోటో షూట్…-Latest News-Telugu Tollywood Photo Image

మరికొంతమంది మాత్రం సినీ రంగంలో ఉన్నప్పుడు అలాంటివన్నీ పట్టించుకోకూడదని, అలాగే ఎలాంటి పాత్రలో అయినా సరే నటించి మంచి పేరు, ప్రఖ్యాతలు సంపాదించాలనే లక్ష్యం ఉంటే కచ్చితంగా విజయం సాధిస్తారని అంటున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నిహారిక చేతిలో ఎలాంటి సినీ అవకాశాలు లేకపోవడంతో వెబ్ సీరీస్ లలో నటించేందుకు సిద్ధమవుతోంది.

ఇందులో భాగంగా ఇప్పటికే  ప్రముఖ ఓటీటీ సంస్థ అయినటువంటి అమెజాన్ ప్రైమ్ నిర్మిస్తున్న ఓ వెబ్ సీరీస్ లో కూడా నటిస్తున్నట్లు సమాచారం.అలాగే  టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్నటువంటి ఆచార్య చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Niharika Konidela Mega Heroine Related Telugu News,Photos/Pics,Images..

footer-test