పెళ్ళికి ముందు ఫోటోషూట్ లతో సందడి చేస్తున్న మెగా డాటర్

మెగా ఫామిలీ నుంచి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సరైన సక్సెస్ అందుకోలేకపోయిన భామ నిహారికా.హీరోయిన్ గా సినిమాలు ఫెయిల్ అయినా నటిగా మాత్రం ఆమె తనని తాను ప్రూవ్ చేసుకుంది.

 Niharika Konidela Latest Wedding Photoshoot Goes Viral, Mega Family, Nagababu, M-TeluguStop.com

అయితే త్వరలో ఆమె పెళ్లిపీటలు ఎక్కబోతుంది.చిరంజీవి స్నేహితుడు గుంటూరు జిల్లా ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ తనయుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యతో ఆమె వివాహం జరగనుంది.

ఇప్పటికే పెళ్లికి సంబందించిన వేడుకలు మొదలైపోయాయి.మెగా ఫ్యామిలీలో జరుగుతున్న వేడుక కావడంతో ఇండస్ట్రీలో అందరూ నిహారికా వైపు ఫోకస్ చేస్తున్నారు.

అయితే పెళ్లి దగ్గర పడుతున్న కొద్ది ఆమె మరింత ఉత్సాహంగా తయారై ఫోటో షూట్ లకి ఫోజులు ఇస్తుంది. ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ లు చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేసుకుంటుంది.

ఇప్పటికే పెళ్లి కూతురు గెటప్ లో చైతన్యతో నిహారికా ఫోటో షూట్ లో పాల్గొని సందడి చేసింది.

ఇదిలా ఉంటే మరోవైపు ఎంతైనా పెళ్ళికి ముందే అన్నట్లు మరికొన్ని రోజుల్లో పెళ్లి పీటలెక్కనున్న మెగా డాటర్ నిహారిక తాజాగా మేగజైన్ కవర్ పేజీ కోసం ఫోటో షూట్ నిర్వహించింది.

కాబోయే వధువు నిహారిక ఈ ఫోటోలలో చాలా అందంగా కనిపించింది.ఎథిక్ దుస్తుల్లో ఉన్న నిహారికకు ఆమె ధరించిన నగలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.గతంలో ఫోటోషూట్ కోసం మోడ్రన్ అవుట్ ఫిట్స్ తో అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపించిన నిహారిక ఇప్పుడు మేగజైన్ కవర్ పేజీ కోసం వధువుగా ముస్తాబై ఫోటోషూట్ చేసింది.కాగా నిహారిక కొన్ని రోజుల క్రితం తన స్నేహితులతో కలిసి గోవాలో బ్యాచిలరేట్ పార్టీ చేసుకున్నారు.

మొత్తానికి పెళ్ళికి ముందు ఇది వరకు ఎప్పుడూ లేని విధంగా నిహారికా మ్యాగజైన్స్ కోసం ఫోటో షూట్ లు ఇస్తూ సందడిగా కనిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube