హ్యాపీ బర్త్ డే బంగారు.. ఐలవ్యూ.. నిహారిక పోస్ట్ వైరల్..!  

మెగా డాటర్ నిహారిక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన జీవితానికి సంబంధించిన విశేషాలతో పాటు సినిమాలు, వెబ్ సిరీస్ లకు సంబంధించిన ముఖ్య విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.అయితే తాజాగా నిహారిక బావ వైష్ణవ్ తేజ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఆమె చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

TeluguStop.com - Niharika Konidela Birthday Wishes Vaishnav Tej

వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమవుతున్న సంగతి తెలిసిందే.

నిహారిక తన పోస్ట్ లో పుట్టినరోజు శుభాకాంక్షలు బంగారు నీకు తెలుసు నేనెంతగా ప్రేమిస్తున్నానో నువ్వు స్టార్ హీరోగా రాణించాలని కోరుకుంటున్నా ఆల్‌ ద వెరీ బెస్ట్‌ వైష్‌గా అని పోస్ట్ పెట్టారు.

TeluguStop.com - హ్యాపీ బర్త్ డే బంగారు.. ఐలవ్యూ.. నిహారిక పోస్ట్ వైరల్..-General-Telugu-Telugu Tollywood Photo Image

హీరో సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ వరుసకు నిహారికకు బావలు అయినప్పటికీ వీళ్లు అన్నాచెల్లెళ్లులాగానే మెలుగుతుంటారు.బావపై ట్విట్టర్ పోస్ట్ ద్వారా నిహారిక అభిమానాన్ని చాటుకున్నారు.

మరోవైపు పెళ్లి తరువాత నిహారిక మళ్లీ వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు.గతంతో నిహారిక ప్రధానపాత్రలో తెరకెక్కిన వెబ్ సిరీస్ లు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.అయితే వెబ్ సిరీస్ లలోకి ఎంట్రీ ఇచ్చిన నిహారిక సినిమాల్లో మళ్లీ నటిస్తారో లేదో తెలియాల్సి ఉంది.గతేడాది డిసెంబర్ నెలలో నిహారిక చైతన్యల వివాహం ఘనంగా జరగగా కొత్తజంట హనీమూన్ కు మాల్దీవులకు వెళ్లిన సంగతి తెలిసిందే.

పెళ్లి తరువాత భర్త చైతన్యతో కలిసి దిగిన ఫోటోలను నిహారిక ఎక్కువగా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.మరోవైపు చైతన్య కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారని వార్తలు వస్తున్నా చైతన్య నిజంగానే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారో లేదో చూడాల్సి ఉంది.

హీరో లుక్స్ ఉండటంతో చైతన్య సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే బాగుంటుందని మెగా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

#Twitter Post #Vaishnav Tej #Birthday Wishes

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Niharika Konidela Birthday Wishes Vaishnav Tej Related Telugu News,Photos/Pics,Images..