సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న నిహారిక భర్త.. కానీ..?

ఈ మధ్య కాలంలో ఏ సెలబ్రిటీ వివాహం జరగనంత ఘనంగా పది రోజుల క్రితం నిహారిక చైతన్యల వివాహం జరిగిన సంగతి తెలిసిందే.ఇప్పటికే మెగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో సినిమా ఇండస్ట్రీలోకి చాలామంది హీరోలు రాగా దాదాపు అందరు హీరోలు సక్సెస్ అయ్యారు.

 Niharika Husband Chaitanya Jonnalagdda Planning On Tollywood Entry,niharika Husb-TeluguStop.com

చైతన్య కూడా వచ్చే ఏడాది హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడని తెలుస్తోంది.అయితే సినిమాల్లోకి ఎంట్రీకి ముందే చైతన్య యాక్టింగ్ కోర్సుల్లో శిక్షణ తీసుకోనున్నాడని సమాచారం.
అయితే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా మెగా ఫ్యామిలీ సహకారం లేకుండానే చైతన్య తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారని సమాచారం.హీరోకు కావాల్సిన లక్షణాలన్నీ తనలో ఉండటంతో హీరోగా సక్సెస్ అవుతానని చైతన్య భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం చైతన్య ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీలో బిజినెస్ స్ట్రాటజిస్ట్ గా పని చేస్తున్నారు.అయితే సినిమాల కోసం ఉద్యోగానికి దూరమవుతారో లేక ఉద్యోగం చేస్తూ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారో తెలియాల్సి ఉంది.

Telugu Heroes, Niharika, Tollywood-Latest News - Telugu

చైతన్య వెబ్ సిరీస్ లలో కూడా నటించే అవకాశం ఉందని వెబ్ సిరీస్ లలో నటనకు వచ్చే ఫీడ్ బ్యాక్ ను బట్టి సినిమాల విషయంలో నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది.నిహారికకు ఇప్పటికే పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరుతో సొంత బ్యానర్ ఉంది.ఈ బ్యానర్ లో పలు వెబ్ సిరీస్ లను నిర్మించి ఆ వెబ్ సిరీస్ లతో నిహారిక నిర్మాతగా కూడా సక్సెస్ సాధించారు.మెగా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ సినిమాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇప్పుడు చైతన్య కూడా కళ్యాణ్ దేవ్ లా మెగా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.అయితే ఈ వార్తల గురించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

చైతన్య సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే హీరోగా సక్సెస్ అవుతారో లేదో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube