సూర్యకాంతంపై నిహారిక నమ్మకం నిలబడితే భవిష్యత్తు

మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు 9 మంది హీరోలుగా వచ్చారు.ఇక ఆ ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన భామ మెగా డాటర్ నిహారికా.

 Niharika Hopes On Suryakantham Movie-TeluguStop.com

డీ షో తో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి తరువాత వెబ్ సిరిస్ లో తనని టెస్ట్ చేసుకున్న నిహారిక ఒక మనసు సినిమా ద్వారా హీరోయిన్ గా అరంగేట్రం చేసింది.అయితే మొదటి సినిమా ఆమెకి చేదు ఫలితం అందించింది.

అయితే రెట్టించిన ఉత్సాహంతో హ్యాపీ వెడ్డింగ్ అంటూ మళ్ళీ వచ్చింది.అది ఎప్పుడు రిలీజ్ అయ్యిందో కూడా ఎవరికి తెలియదు.

ఇక ఈ రెండు సినిమాలు ఫెయిల్ కావడానికి కారణం నిహారికాని మెగా ఫ్యాన్స్ గాని, కామన్ ఆడియన్స్ కాని, ఎనర్జీ లేని పాత్రలో చూడలేకపోవడమే.

బయట ఎప్పుడు ఎనర్జిటిక్ గా కనిపించే నిహారికా సినిమాలో ఎంచుకునే పాత్రలలో అంత జోష్ ఉండదు.అయితే ఈ సారి వాస్తవం అర్ధం చేసుకున్న ఈ భామ సూర్యకాంతం అంటూ తన క్యారెక్టరైజేషన్ కి సరిపోయే పాత్రతో ప్రేక్షకుల ముందుకి హీరోయిన్ గా వస్తుంది.రెండు సినిమాలతో చేదు అనుభవాన్ని అందుకున్న నిహారికా ఈ సినిమా కచ్చితంగా హిట్ అనే ఉత్సాహంతో ఉంది.

ఈ సినిమాతో హిట్ కొట్టి తనని తాను హీరోయిన్ గా ప్రూవ్ చేసుకోవాలని గట్టి పంతంగా నిహారికా ఉంది.ఇదిలా ఉంటే ఈ సినిమా రిజల్ పైనే నిహారికా హీరోయిన్ గా ముందుకి వెళ్ళాలా లేదా డిసైడ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube