పెళ్లైనా ఆ విషయంలో అస్సలు తగ్గని నిహారిక.. కారణాలు ఇవేనా?

మెగా డాటర్ నిహారికకు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు.ఏ తప్పు చేయకపోయినా కొన్నిరోజుల క్రితం ఒక వివాదం ద్వారా నిహారిక వార్తల్లో నిలిచారనే సంగతి తెలిసిందే.

 Niharika  Glamorous Photos Goes Viral In Social Media Details Here,niharika Koni-TeluguStop.com

అయితే పెళ్లి తర్వాత కూడా గ్లామరస్ ఫోటోలను షేర్ చేయడం ద్వారా నిహారిక వార్తల్లో నిలుస్తున్నారు.మెగా డాటర్ నిహారిక పలు వెబ్ సిరీస్ లు, సినిమాలలో నటించగా నిహారిక నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినా వెబ్ సిరీస్ లు మాత్రం సక్సెస్ సాధించాయి.
మెగా ఫ్యామిలీ నుంచి సినిమా రంగంలోకి వచ్చిన హీరోలలో ఎక్కువమంది హీరోలు సక్సెస్ ను సొంతం చేసుకున్నారు.అయితే ఒక మనసు, సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ సినిమాలతో ఇండస్ట్రీలో అదృష్టాన్ని పరీక్షించుకున్న నిహారికకు ఆ సినిమా ఫలితాలు షాకిచ్చాయి.

పెళ్లి తర్వాత నిహారిక పలు వెబ్ సిరీస్ లకు నిర్మాతగా వ్యవహరిస్తున్నా నటనకు మాత్రం దూరంగా ఉంటున్నారు.నిహారిక భర్తకు మాత్రం సినిమాలపై ఆసక్తి లేదని తెలుస్తోంది.

Telugu Fans, Nagababu, Nihairka, Niharika, Niharika Hot-Movie

నిహారిక సినిమాల్లోకి రావడం మెగా అభిమానులకు ఇష్టం లేదని ఆ రీజన్ వల్లే ఆమె హీరోయిన్ గా అనుకున్న స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేకపోయారనే భావన చాలామందిలో ఉంది.2020 సంవత్సరం డిసెంబర్ నెలలో నిహారిక పెళ్లి జరిగింది.ప్రస్తుతం స్టైలిష్ ఫోటోలలో దర్శనమిస్తున్న నిహారిక త్వరలో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తారని అభిమానులు భావిస్తున్నారు.

ప్రస్తుతం నిహారిక ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నారని త్వరలో ఆ వివరాలను అధికారికంగా వెల్లడిస్తారని సమాచారం అందుతోంది.

నిహారిక గ్లామరస్ ఫోటోలకు యూత్ ఫిదా అవుతున్నారు.ఈ వెబ్ సిరీస్ లో అనసూయ కూడా కీలక పాత్రలో నటించనున్నారని సమాచారం అందుతోంది.నిహారిక తర్వాత ప్రాజెక్ట్ లతో సక్సెస్ లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube