అల్లు అర్జున్ మామయ్య కొడుకే.. కానీ నేను అలానే పిలిచేదాన్ని: నిహారిక

Niharika Crazy Comments On Her Brother In Law Star Allu Arjun

మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె నాగబాబు కూతురుగా, యాంకర్ గా, అల్లరి అల్లరి చేస్తూ, తన చలాకీతనంతో బాగా ఫేమస్ అయింది.

 Niharika Crazy Comments On Her Brother In Law Star Allu Arjun-TeluguStop.com

అలాగే వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.ఇక నిహారిక జొన్నలగడ్డ చైతన్య వివాహం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే.

పెళ్లి తర్వాత నిహారిక నిర్మాతగా వ్యవహరిస్తుంది.ఇది ఇలా ఉంటే తాజాగా నిహారిక తన మామ కొడుకు అయిన అల్లు అర్జున్ గురించి తన మనసులోని మాట బయట పెట్టేసింది.

 Niharika Crazy Comments On Her Brother In Law Star Allu Arjun-అల్లు అర్జున్ మామయ్య కొడుకే.. కానీ నేను అలానే పిలిచేదాన్ని: నిహారిక-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇటీవలే నిహారిక ఈ టీవీలో ప్రసారం అయ్యే ఆలీతో సరదాగా షోలో పాల్గొన్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే నిహారిక పలు విషయాల గురించి, తన ఫ్యామిలీ గురించి పలు ఆసక్తికర విషయాలను తెలిపింది.

ఈ నేపథ్యంలోనే నిహారిక టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ పై చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.మామయ్య కొడుకు అయినా బన్నీని నేను అన్న అని పిలుస్తుంటాను అని నిహారిక చెప్పింది.

అలాగే అల్లు అర్జున్ నటించిన ప్రతి ఒక్క సినిమాలో ఒక వైవిధ్యం ఉంటుందని, అతను నటించిన సినిమాలలో ఫొటోస్ అన్నీ ఒక చోట పెడితే ఈ ఫోటో ఏ సినిమాలోదో చెప్పేస్తాను అంటూ ఆమె తెలిపింది.సినిమాలలో లుక్ పరంగా బన్నీ చాలా కేర్ తీసుకుంటారని, ఇక జులాయి సినిమాలో బన్నీ అన్న అంటే చాలా ఇష్టమని నిహారిక తెలిపింది.నిహారిక ఇటీవలే ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అనే వెబ్ సిరీస్ కు నిర్మాతగా వ్యవహరించి పలువురి ప్రముఖులతో శభాష్ అనిపించుకుంది.

#Web #Brother #Alitho Saradaga #Allu Arjun #Niharika

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube