ఉపాసన సంరక్షణలో మెగా ప్రిన్సెస్ ఆ స్థాయికి వెళ్తుంది.. నిహారిక కామెంట్స్ వైరల్!

టాలీవుడ్( Tollywood ) స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్( Ram Charan ) తాజాగా తండ్రి అయిన సంగతి తెలిసిందే.

మెగా ఫ్యామిలీలోకి మరో మెంబర్ యాడ్ కావడం అభిమానులకు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తోంది.

తాజాగా నిహారిక( niharika ) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చరణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.రామ్ చరణ్ ను బాపూజీ అని పిలుస్తామని నిహారిక వెల్లడించడం గమనార్హం.

గతేడాది చరణ్ తండ్రి కానున్నాడని తెలిసిందని ఆ వార్త తెలిసినప్పటి నుంచి ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉందని నిహారిక పేర్కొన్నారు.రామ్ చరణ్ మెగా కజిన్స్ అందరినీ ప్రేమగా చూసుకుంటాడని నిహారిక చెప్పుకొచ్చారు.

ఈ రీజన్ వల్లే మేము చరణ్ ను బాపూజీ( Bapuji ) అని పిలుస్తామని నిహారిక చెప్పుకొచ్చారు.చరణ్ తనకు సంబంధించిన ప్రతి వారిపై ప్రేమను చూపుతాడని నిహారిక కామెంట్లు చేశారు.

Advertisement

ఉపాసన శక్తివంతమైన మహిళ అని నిహారిక పేర్కొన్నారు.రామ్ చరణ్ ఉపాసన సంరక్షణలో పాప కచ్చితంగ గొప్పగా ఎదిగి ఉన్నత స్థాయికి వెళ్తుందని నిహారిక అన్నారు.

నిహారిక వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.నిహారిక ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లను నిర్మించడంతో పాటు పలు ప్రాజెక్ట్ లలో నటిస్తూ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.రామ్ చరణ్ విషయానికి వస్తే గేమ్ ఛేంజర్( game changer ) సినిమాతో బిజీగా ఉండటంతో పాటు బుచ్చిబాబు డైరెక్షన్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

చరణ్ సినిమాలో నటిస్తే నిహారిక క్రేజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది.రామ్ చరణ్ రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరింత ఎదగాలని అభిమానులు భావిస్తున్నారు.రామ్ చరణ్ రెమ్యునరేషన్ భారీ రేంజ్ లో ఉండగా తర్వాత సినిమాలతో సైతం భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 
Advertisement

తాజా వార్తలు