మెగా డాటర్ నిహారిక కొణిదెల ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.యాంకర్ గా తన ప్రస్థానం మొదలుపెట్టిన ఈమె అనంతరం నటిగా నిర్మాతగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.
ఈ విధంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న నిహారిక 2 సంవత్సరాల క్రితం జొన్నలగడ్డ చైతన్యను వివాహం చేసుకున్నారు.వివాహం అనంతరం నిహారిక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకునే వారు.
ఈ క్రమంలోనే ఇన్స్టాగ్రామ్ వేదికగా తన జిమ్ ట్రైనర్ తో కలిసి చేసిన వీడియో నిహారిక సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పెద్ద ఎత్తున నెటిజన్ల ఆగ్రహానికి గురైంది.దీంతో ఈమె ఇంస్టాగ్రామ్ అకౌంట్ కూడా డిలీట్ చేశారు.
ఇకపోతే ఈ విషయం గురించి చర్చలు ముగియకముందే నిహారిక మరోసారి పబ్ వ్యవహారం లో పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు.అయితే ఈ ఈ విషయం నుంచి బయటపడిన నిహారిక తన భర్తతో కలిసి జోర్డాన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తన ట్రిప్ కి సంబంధించిన ఫోటోలను నిహారిక సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటున్నారు.
ఈ క్రమంలోనే నిహారిక జోర్డాన్ ట్రిప్ కి సంబంధించిన ఒక ఫోటోని షేర్ చేస్తూ.నేను ఎక్కడున్నా స్వర్గాన్ని వెతుక్కుంటాను అనే క్యాప్షన్ తో ఈ ఫోటోని షేర్ చేశారు.ఈ క్రమంలోనే ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ ఫోటో చూసిన మెగా అభిమానులు ఈమె పై ప్రశంసలు కురిపిస్తూ నిత్యం మీరూ ఈ పిల్లర్ మాదిరిగానే ఎంతో దృఢంగా ఉండాలి అంటూ కామెంట్ చేయగా.మరికొందరు మాత్రం ఇంకొకసారి పోలీసులకు దొరికితే నిజంగానే స్వర్గం చూస్తావు అంటూ కామెంట్ చేస్తున్నారు.
మొత్తానికి నిహారిక ఈ ఫోటో పై నెటిజన్లు తీవ్రస్థాయిలో ట్రోల్ చేస్తున్నారు.