కీసుపిట్టగా మారిన నిహారిక.. ఆ పాట వింటే చమట చిందించగలను అంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ముద్దుగుమ్మ, నాగబాబు ముద్దుల కూతురు నిహారిక కొణిదెల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.మెగా ఫ్యామిలీ నుంచి తొలి హీరోయిన్ గా అడుగుపెట్టిన ఈ మెగా ప్రిన్సెస్ కొంతవరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంది.

 Niharika Comment On The Rrr Natu Natu Song Details, Niharika, Tollywood, Rrr Movie, Natu Natu Song, Telugu Film Industry, Niharika Konidela, Nagababu, Chaitanya Jonnalagadda, Mega Daughter Niharika, Niharika In Gym-TeluguStop.com

కానీ ఈమెకు వెండితెరపై అంతగా అవకాశాలు అందుకోలేకపోయింది.కేవలం కొన్ని సినిమాలకు మాత్రమే ఒక నటిగా పరిమితమైంది.

ఇక సినిమాలకు దూరంగా ఉంటూ సోషల్ మీడియాకు బాగా దగ్గరలో ఉంది.ఇంట్లో కంటే నెట్టింట్లో బాగా రచ్చ చేస్తుంది.నటిగానే కాకుండా నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టింది.ఆ మధ్య ఓ వెబ్ సిరీస్ ను కూడా విడుదల చేసి మంచి సక్సెస్ సొంతం చేసుకుంది.

 Niharika Comment On The Rrr Natu Natu Song Details, Niharika, Tollywood, Rrr Movie, Natu Natu Song, Telugu Film Industry, Niharika Konidela, Nagababu, Chaitanya Jonnalagadda, Mega Daughter Niharika, Niharika In Gym-కీసుపిట్టగా మారిన నిహారిక.. ఆ పాట వింటే చమట చిందించగలను అంటూ-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతేకాకుండా గతంలో జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకొని ఓ ఇంటి కోడలిగా బాధ్యతలు చేపట్టింది.

ఇక పెళ్లి తర్వాత మాత్రం నిహారిక లో వచ్చిన మార్పు అంతా ఇంతా కాదు.

సోషల్ మీడియాలో మాత్రం ప్రతి రోజు ఏదో ఒక పోస్ట్ తో హల్ చల్ చేస్తుంది.పైగా గ్లామర్ గా రెడీ అవుతూ అందర్నీ నోరు వెళ్ళబెట్టేలా చేస్తుంది.

హాట్ హాట్ లుక్ లతో అందర్నీ ఫిదా చేస్తుంది.ఇక తన భర్తతో దిగిన రొమాంటిక్ ఫోటోలను బాగా షేర్ చేసుకుంటూ నెటిజన్ల నుండి ట్రోల్స్ ఎదుర్కొంటుంది.

అవుటింగ్ అంటూ అంటూ భర్తతో షికార్లు కొడుతూ తెగ ఎంజాయ్ చేస్తుంది.

గతంలో వ్యక్తిగత విషయాల వల్ల కొన్ని రోజులు సోషల్ మీడియా లైఫ్ కూడా దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.గతంలో తన జిమ్ ట్రైనర్ తో చనువుగా ఉండటం వల్ల బాగా విమర్శలు ఎదుర్కొంది.అంతలోనే ఫుడింగ్ అండ్ మింక్ పబ్ రైడ్ లో డ్రగ్స్ కేసులో పోలీసుల అదుపులో చిక్కిన సంగతి తెలిసిందే.

అలా కొన్ని రోజులు తన ఇన్ స్టాకు పూర్తిగా దూరంగా ఉండగా మళ్లీ తను రిఫ్రెష్ అయి ఇటీవలే ఇన్ స్టా లో అడుగు పెట్టింది.

అప్పటి నుంచి తన ఫోటోలను పంచుకుంటూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

పొట్టి పొట్టి బట్టలతో మళ్ళీ దర్శనమిస్తుంది.అయినా కూడా నెగిటివ్ కామెంట్లు బాగా ఎదుర్కొంటుంది.

ఇక అవన్నీ పట్టించుకోకుండా నిహారిక తన లైఫ్ ఏంటో తాను చూసుకుంటుంది.జాగ్రత్తగా అడుగులు వేస్తుంది.ఇక తాజాగా తన సోషల్ మీడియా వేదికగా మరో ఫోటో పంచుకోగా అందులో జిమ్ లో ఉన్నట్లు తెలుస్తుంది.

ఇక ఆ ఫోటోకు ఒక క్యాప్షన్ కూడా ఇచ్చింది.

తను జిమ్ములో ఇక ఎక్ససైజ్ చేయను అనుకున్న సమయంలో నాటు నాటు పాట తనకు కాస్త ఊరటను అందించిందని.అలా ఇంకా చెమట చిందించే విధంగా చేయాలి అనిపించింది అని తెలిపింది.

అంతేకాకుండా తన జిమ్ లో ఉన్నవాళ్లు కూడా మళ్ళీ ఇంకొకసారి చెయ్యి కీసుపిట్ట అని అన్నారని తెలిపింది.అంటే నిహారిక ఎప్పుడూ అల్లరి చేస్తుంది కాబట్టి కీసుపిట్ట అని పేరు పెట్టారేమో.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube