ఆచార్యలో నిహారిక అసలు విషయం ఇదేనంటున్న మెగా కాంపౌండ్‌

నాగబాబు కూతురు నిహారికను ‘ఆచార్య’ చిత్రంలో కీలక పాత్ర కోసం కొరటాల శివ సంప్రదించాడు అంటూ గత రెండు మూడు రోజులుగా మీడియాలో ప్రముఖంగా వార్తలు వస్తున్నాయి.రామ్‌ చరణ్‌కు చెల్లి పాత్రలో ఆచార్యలో నిహారిక కనిపించబోతుందని, ఈమె పాత్ర సినిమాకు చాలా హైలైట్‌గా ఉంటుందని అన్నారు.

 Niharika, Chiranjeevi,ram Charan,acharya Movie,pr Team,mega-TeluguStop.com

నిహారిక వల్లే చరణ్‌ మరియు చిరంజీవిల మద్య పరిచయం ఏర్పడుతుందని, నిహారిక కథకు టర్నింగ్‌ పాయింట్‌గా ఉంటుందనే వార్తలు వచ్చాయి.
నిహారిక ఇప్పటికే సైరా చిత్రంలో నటించిన విషయం తెల్సిందే.

కనుక మరోసారి చిరంజీవి సినిమాలో ఆమె నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కొందరు భావించారు.కాని అసలు విషయం ఏంటీ అంటే ఆచార్య సినిమాలో అసలు నిహారిక లేదట.

ఈ విషయాన్ని స్వయంగా మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా ఉండే పీఆర్‌ టీం ప్రకటించింది.మీడియాలో వస్తున్న రకరకాల పుకార్లు ఇకపై అయినా ఆపేయండి అంటూ వారు విజ్ఞప్తి చేశారు.

Telugu Acharya, Chiranjeevi, Niharika, Pr, Ram Charan-

ఆచార్య చిత్రంలో రామ్‌ చరణ్‌ పాత్రపైనే ఇంకా క్లారిటీ రాలేదు. ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌ ఉన్న కారణంగా ఆచార్యలో చరణ్‌ నటిస్తాడా లేదా అనేది తెలియడం లేదు.ఇలాంటి సమయంలో చరణ్‌ కు సోదరి పాత్రలో నిహారిక నటించబోతుంది అంటూ వార్తలు రావడం విడ్డూరంగా ఉంది అంటూ మెగా వర్గాల వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.కొరటాల శివ కూడా నిహారిక నటిస్తున్న విషయంను కొట్టి పారేశాడు.

ఆయన సన్నిహితులతో ఈ విషయాన్ని చెప్పినట్లుగా సమాచారం అందుతోంది.నిహారిక ప్రస్తుతం ఒక వెబ్‌ సిరీస్‌ను చేస్తోంది.

మరో వైపు బుల్లి తెరపై కూడా సందడి చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube