నిహారిక పెళ్లి వేదిక ఉదయ్‌పూర్‌ ప్రత్యేకత ఏంటో తెలుసా?

మెగా డాటర్‌ నిహారిక వివాహంకు తేదీ మరియు వేదిక ఫిక్స్‌ అయ్యింది.కరోనా టైంలోనూ ఏమాత్రం తగ్గకుండా మెగా రేంజ్‌లోనే వివాహ వేడుకలు ఉండేలా నాగబాబు ప్లాన్‌ చేశాడు.

 Niharika Chaitanya Wedding In Rajasthan Udaipur Uday Villa-TeluguStop.com

తన ముద్దుల కూతురు వివాహంను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న నాగబాబు పెళ్లిని ప్రతిష్టాత్మక ఉదయ్‌పూర్‌లో నిర్వహించేందుకు సిద్దం అయ్యాడు.బాలీవుడ్‌ స్టార్స్‌ ఎక్కువగా రాజస్థాన్‌లోన ఉదయ్‌ పూర్‌ లోని విల్లాల్లో లేదా పెద్ద పెద్ద హోటల్స్‌ లో పెళ్లిలు చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు.

దేశంలో ఎక్కువ శాతం సెలబ్రెటీ వేడుకలు రాజస్థాన్‌ లోని ఆ రాజ ప్రస్థానంలోనే జరుగుతూ ఉంటాయి.అక్కడి అద్బుతమైన కోట కట్టడాల నడుమ వివాహ బందంను ఏర్పర్చుకునేందుకు సెలబ్రెటీలు తహతహలాడుతూ ఉంటారు.

ఇప్పటికే పలువురు ప్రముఖులు ఆ కోటల మద్యలో పెళ్లి పీఠలు ఎక్కిన విషయం తెల్సిందే.ఇప్పుడు అదే జాబితాలోకి నిహారిక చేరబోతుంది.

నిహారిక, చైతన్యల వివాహంను డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ గా ప్లాన్‌ చేశారు.ప్రముఖ మ్యారేజ్‌ ఈవెంట్‌ సంస్థ ఈ పెళ్లిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీ ఖర్చుతో ఏర్పాట్లు చేసింది.

డిసెంబర్‌ 9వ తారీకున పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటి నుండే జరుగుతున్నాయి.రాజస్తాన్‌ అంటేనే రాజ ప్రసాదాలు మరియు రాజుల కాలం నాటి కట్టడాలు గుర్తుకు వస్తాయి.

అలాంటిది ఉదయ్‌పూర్‌ పూర్తిగా రాజుల కాలం నాటి భవనాలను తలపిస్తూ ఉంటుంది.అందుకే ఎక్కువ మంది సెలబ్రెటీలు అక్కడ పెళ్లి చేసుకోవాలని భావిస్తూ ఉంటారు.రాజస్థాన్‌ ఉదయ్‌ పూర్‌లోని ఉదయ్‌ విల్లా స్థానికంగా అత్యంత అందమైన విలాసవంతమైన విల్లాగా పేరు దక్కించుకుంది.400 నుండి 500 మంది వరకు గెస్ట్‌ లకు ఉదయ్‌ విల్లాలో ఏర్పాట్లు చేయవచ్చు.పక్కనే ఉండే హోటల్స్‌ లో ఇతర బంధువులకు విడిది ఏర్పాటు చేసుకునే వీలు ఉంటుంది.మొత్తానికి ఉదయ్‌ విల్లా కళ్లు చెదిరే శిల్ప కళతో మరియు అద్బుతమైన ఇంటీరియర్‌ తో ఉంటుంది.

అందుకే అక్కడ మెగా డాటర్‌ వివాహంకు మెగా ఫ్యామిలీ సిద్దం అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube