నాగబాబు కూతురు నిహారిక కొణిదెల త్వరలో జొన్నలగడ్డ వారి ఇంటి కోడలు కాబోతుంది.ఏపీకి చెందిన ఐపీఎస్ కొడుకు జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక వివాహం ఫిక్స్ అయ్యింది.
ఆగస్టులో వివాహ నిశ్చితార్థంకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.వచ్చే ఏడాదిలో పెళ్లి చేసుకోబోతున్నారు.
పెళ్లి వార్తలు రాగానే ఎవరు ఈ చైతన్య అంటూ నెటిజన్స్ తెగ వెదికేస్తున్నారు.గత మూడు నాలుగు రోజుల్లో లక్షల్లో జొన్నల గడ్డ చైతన్య గురించి సెర్స్ చేశారు.
సోషల్ మీడియాలో కూడా జొన్నలగడ్డ చైతన్య గురించి వెదుకుతున్నారు.నిహారికతో పెళ్లి పిక్స్ కాకముందు వరకు చైతన్య ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య రెండు వేల లోపు ఉండేది.
ఇప్పుడు అది దాదాపుగా 40 వేలకు చేరింది.మరికొన్ని రోజుల్లోనే లక్షకు చేరే అవకాశాలు ఉన్నాయి.
పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చైతన్య క్రేజ్‌ను దక్కించుకోవడంతో పాటు ఆయన గురించి తెగ చర్చించుకునేలా ట్రెండ్ అవుతున్నాడు.

కేవలం సెలబ్రెటీలు మరియు రాజకీయ నాయకులు మాత్రమే గూగుల్‌లో అప్పుడప్పుడు ట్రెండ్ అవుతూ ఉంటారు.కాని ఇప్పుడు మాత్రం చైతన్య ట్రెండ్ అవుతున్నాడు.గత కొన్ని రోజులుగా ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్న కారణంగా చైతన్య జొన్నలగడ్డ పేరు సెలబ్రెటీ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
అయినా నిహారికను చేసుకోబోతున్నాడు అనగానే వెంటనే జొన్నలగడ్డ సెలబ్రెటీ అయినట్లే కదా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.మొత్తానికి తెలుగు ప్రేక్షకులకు మరో కొత్త సెలబ్రెటీగా జొన్నలగడ్డ చైతన్యగా చెప్పుకోవచ్చు.