సిరీస్‌లకే నిహారిక పరిమితం అవ్వాల్సి ఉంటుందా?

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక( Niharika ) పెళ్లి తర్వాత నటనకు పూర్తిగా దూరం అయిన విషయం తెల్సిందే.నిర్మాతగా మాత్రమే ఇండస్ట్రీలో కొనసాగుతూ వస్తోంది.

 Niharika As Heroine Coming Soon , Niharika, Flim News, Flim Updates, Mega Daught-TeluguStop.com

హీరోయిన్‌ గా మళ్లీ ఈమె కనిపించదని భావిస్తున్న సమయంలో అనూహ్యంగా నిహారిక మళ్లీ నటన వైపు అడుగులు వేసింది.ఒక వెబ్‌ సిరీస్( Web series ) తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది.

ఈ అమ్మడు నటిగా రీ ఎంట్రీ ఇవ్వడంతో వైవాహిక బంధంకు గుడ్‌ బై చెప్పిందని అంతా భావిస్తున్నారు.ఆ విషయాన్ని ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

నిహారిక సినిమా ల్లో నటిస్తుందా లేదా అనే ప్రశ్న వచ్చిన సందర్భంగా సిరీస్ ల్లో మాత్రమే నటిస్తుందని అంటున్నారు.ప్రస్తుతం నిహారిక సిరీస్ లపై దృష్టి పెడుతోంది.నిహారిక హీరోయిన్ గా నటించేందుకు ఓకే చెబుతోంది.కానీ హీరో లు ఎవరు కూడా ఈమె తో నటించేందుకు ఓకే చెప్పే పరిస్థితి లేదు.అయినా కూడా ఈమె నటించేందుకు గాను రెడీ అవుతుందని కొందరు మాట్లాడుకుంటున్నారు.

ఒక వేళ నిహారిక కనుక సినిమా ల్లో హీరోయిన్ గా నటిస్తే అది లేడీ ఓరియంటెడ్‌ మూవీ( lady oriented movie ) అవుతుంది.భారీ అంచనాల నడుమ రూపొందిన తాజా వెబ్‌ సిరీస్ సక్సెస్‌ అయితే తప్పకుండా నిహారిక హీరోయిన్ గా సినిమా ల్లో కూడా ప్రయత్నాలు చేసే అవకాశం ఉందని మెగా కాంపౌండ్ నుండి ప్రచారం జరుగుతోంది.భర్త నుండి విడి పోయిందా అనే విషయం లో స్పష్టత రాలేదు.

ఇటీవల ఒక ప్రెస్ మీట్‌ లో( press meet ) నిహారిక మాట్లాడుతూ తన వైవాహిక జీవితం గురించి స్పందించేందుకు ఆసక్తి చూపించలేదు.ఆ ప్రశ్నలు కాకుండా మరేమైనా అన్నట్లుగా సమాధానం దాటవేసింది.

కనుక ముందు ముందు నటిగా సినిమాలు మరియు సిరీస్ లు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube