నిహారిక కూడా అదే మెగా డప్పు కొడుతుంది..!

మెగా హీరోల డప్పు మోత ఈ మధ్య ఎక్కువైందని చెప్పాలి.ఏ సినిమా వేడుక చూసిన మెగా కుర్రాళ్ల హడావిడి షురూ అవుతుంది.

 Niharika About Mega Image-TeluguStop.com

ఇక ఇది చాలదు అన్నట్టు మెగా డాటర్ నిహారిక కూడా ఒక మనసుతో ఎంట్రీ ఇచ్చేస్తుంది.ఈ శుక్రవారం థియేటర్స్ లో సందడి చేయనున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిహారిక కూడా మెగా ట్యాగ్ కేవలం ఒక్క సినిమాకే ఆ తర్వాత సొంత టాలెంటే తనని నిలబెడుతుంది అంటుంది.

ఓ పక్క మెగా భజన చేస్తూనే మరో పక్క ఇలాంటి కామెంట్స్ చేయడం మెగా వారసులకు.వారసురాళ్లకు అలవాటైంది.

అంతేకాదు తన ఎంట్రీకి నాన్న నాగబాబు, పెదనాన్న చిరంజీవి ఒప్పుకున్నా ఫ్యాన్స్ అభ్యంతరాలు వ్యక్తం చేశారని.అందుకే వారితో మాట్లాడి ఒప్పించానని అంటుంది.

ఇక వారికి మాటిచ్చినట్టుగానే కేవలం అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే నటిస్తానని అన్నది నిహారిక.నటిగా తాను బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తేనే తర్వాత అవకాశాలు వస్తాయని కేవలం తాను మెగా వారసురాలు అయినంత మాత్రాన మొదటి రెండు మూడు ఆఫర్స్ తప్ప మిగతావి కష్టం అంటుంది.

మరి వస్తున్న ప్రతి ఒక్క మెగా గ్యాంగ్ ఇలాంటి వాదనే వినిపిస్తే మరి మెగా ట్యాగ్ వాడటం ఎందుకు.మెగా వారసులం అని చెప్పడం ఎందుకు.

వారు అనుకున్న అనుకోకపోయినా కచ్చితంగా మెగా ఇమేజ్ ఉండబట్టే వారికి ఈ మాత్రం క్రేజ్.అది గమనించి నడుచుకుంటే మంచిది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube