తెలంగాణలో కూడా స్టార్ట్ అయిన నైట్ కర్ఫ్యూ

రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభణ భారీగా ఉందన్న సంగతి తెలిసిందే.భయంకరంగా ఈ మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేస్తూ ఉన్నాయి.

 Night Curfew Started In Telangana State , Night Curfew, Telangana, Corona Second-TeluguStop.com

ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకి ఊహించని విధంగా కేసులు బయటపడుతూ ఉండటంతో ఇప్పటికే విద్యాసంస్థలను క్లోజ్ చేసి పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.

అయినా గాని మహామారి ప్రభావం భారీగా ఉండటంతో తాజాగా తెలంగాణలో కూడా కేసులు పెరుగుతూ ఉండటంతో ఈరోజు నుండి మే ఒకటో తారీకు వరకు రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.

రాత్రి తొమ్మిది గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని పేర్కొంది.ఇదిలాఉంటే నిన్నే హైకోర్టు కరోనా నిబంధనల విషయంలో ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో హెచ్చరించడం జరిగింది.

అయితే ఇంతలోనే నైట్ కర్ఫ్యూ ప్రకటన రావడం విశేషం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube