దేశంలోని ఆ 20 నగరాల్లో నైట్ కర్ఫ్యూ విధిస్తున్న అధికారులు.. ఎక్కడంటే.. ?

గత సంవత్సరం వచ్చిన కరోనా దేశ ప్రజల జీవితాలను కోలుకోకుండా చేసింది.కాగా ప్రస్తుతం వచ్చిన సెకండ్ వేవ్ కూడా మొదటి కరోనా కంటే బాప్‌లా ఉందంటున్నారు.

 Night Curfew Enforced In 20 Cities In The State Of Gujarat-TeluguStop.com

ఇప్పటికే చాపకింద నీరులా తన పనిని ప్రారంభించిన ఈ కరోనా సెకండ్ వేవ్ ప్రస్తుతం తీవ్ర రూపం దాల్చి లాక్‌డౌన్ దిశగా ప్రయాణిస్తుంది.దీని ఫలితంగా దేశంలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి.

ఈ క్రమంలో మహారాష్ట్రలో నైట్ కర్ఫ్యూ, ఉదయం 144 సెక్షన్, వీకెండ్స్ లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు.కాగా ఈ నెలాఖరు వరకు ఇదే కొనసాగుతుందని అంటున్నారు అధికారులు.

 Night Curfew Enforced In 20 Cities In The State Of Gujarat-దేశంలోని ఆ 20 నగరాల్లో నైట్ కర్ఫ్యూ విధిస్తున్న అధికారులు.. ఎక్కడంటే.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మరోవైపు దేశరాజధాని ఢిల్లీలో కూడా రాత్రి సమయంలో కర్ఫ్యూ విధించారు.

ఇదిలా ఉండగా గుజరాత్ లో కూడా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న నేపధ్యంలో రాష్ట్రం లోని 20 నగరాల్లో రాత్రి కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట.

ఇక ఈ కరోనా ఉదృతి ఇలాగే కొనసాగితే ముందు ముందు ఇంకెన్ని ఘోరపరిస్దితులు ఎదుర్కొన వలసి వస్తుందో చూడాలి.

#20 Cities #Corona Spread #Gujarat #Night Curfew

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు