నైట్ క్లాసుల పేరుతో విద్యార్థులపై లైంగిక దాడి...  

School Teacher Arrested In Kurnool District - Telugu Kurnool District Latest News, Kurnool District News, Kurnool Latest News, Kurnoolcrime News, School Teacher Arrest, School Teacher Latest News, School Teacher News

ప్రస్తుత కాలంలో కొందరు పసి పిల్లలపై లైంగిక దాడికి పాల్పడుతూ వారి చేస్తున్నటువంటి వృత్తికి కళంకం తెస్తున్నారు. తాజాగా పాఠశాలలో చచదివేటువంటి విద్యార్థులను ముగ్గురు  కీచక ఉపాధ్యాయులు రాత్రిపూట స్పెషల్ క్లాస్ అని పిలిచి వారి పై లైంగిక దాడి చేస్తున్నటువంటి ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు నగరంలో చోటు చేసుకుంది.

School Teacher Arrested In Kurnool District - Telugu Kurnool District Latest News, Kurnool District News, Kurnool Latest News, Kurnoolcrime News, School Teacher Arrest, School Teacher Latest News, School Teacher News-Latest News-Telugu Tollywood Photo Image

వివరాల్లోకి వెళితే యశ్వంత్, చరణ్, కార్తీక్ అనే ఓ ముగ్గురు వ్యక్తులు కర్నూలు నగరంలో స్థానికంగా ఉన్నటువంటి ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు.అయితే వీరు పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులను టార్గెట్ చేసి రాత్రిపూట స్పెషల్ క్లాసులని పిలిచి వారిపై లైంగిక దాడి చేస్తున్నారు.

అలాగే ఈ లైంగిక దాడి చేస్తున్న సమయంలో సెల్ ఫోనులో చిత్రీకరించి ఆ వీడియోలను బయట పెడతామంటూ బెదిరించారు.దీంతో విద్యార్థులు కిక్కురుమనకుండా ఉండిపోయారు.అయితే ఓ విద్యార్థి ధైర్యం చేసి తమ తల్లిదండ్రులకు ఈ విషయం తెలియజేయగా  సంగతి తెలుసుకున్న తల్లిదండ్రులు ఒక్కసారిగా ఖంగు తిన్నారు.

దీంతో వెంటనే విద్యార్థిని వెంటబెట్టుకొని దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి వెళ్లి కీచక ఉపాధ్యాయుల పై ఫిర్యాదు చేశారు.బాధితుడి తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకున్న టువంటి పోలీసులు స్కూల్ యాజమాన్యాన్ని సంప్రదించి విచారించారు.దీంతో పలు విద్యార్థులపై కూడా నిందితులు లైంగిక దాడికి పాల్పడినట్లు విచారణలో తేలడంతో వెంటనే నిందితులను అరెస్టు చేశారు.

తాజా వార్తలు