రూ. 70 కోట్లను విత్‌ డ్రా చేసుకుని ఇంటికి తీసుకు వచ్చాడు, తర్వాత రోజు మళ్లీ బ్యాంక్‌ లో డిపాజిట్‌ చేశాడు.. ఎందుకంటే?  

Nigeria\'s Richest Man Cashes Out Rs 69,23,10,000 From Bank-nigeria\\'s Richest Man,withdraw 10 Million Dollars,రూ. 70 కోట్లను విత్‌ డ్రా

ఒక వ్యక్తి వంద రూపాయలు సంపాదించాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. అలాంటిది కోట్ల రూపాయలు సంపాదించే వారు ఏ స్థాయిలో బాధలు, కష్టాలు పడుతారో అర్థం చేసుకోవచ్చు. డబ్బున్న వారు డబ్బు లేని వారు ఇద్దరు కూడా కష్టపడుతూనే ఉంటారు..

రూ. 70 కోట్లను విత్‌ డ్రా చేసుకుని ఇంటికి తీసుకు వచ్చాడు, తర్వాత రోజు మళ్లీ బ్యాంక్‌ లో డిపాజిట్‌ చేశాడు.. ఎందుకంటే?-Nigeria's Richest Man Cashes Out Rs 69,23,10,000 From Bank

అయితే డబ్బు లేని వారి కంటే డబ్బున్న వారు తక్కువ సంతోషంగా ఉంటారని కొందరు అంటూ ఉంటారు. సరిపోయేంత డబ్బు ఉంటే ఖచ్చితంగా సంతోషంగా జీవితం గడపవచ్చు. వేల కోట్లు ఉన్నా కూడా ఆ డబ్బు మన కంటి ముందు ఉండదు కదా అని కొందరు అంటూ ఉంటారు.

అందుకే ఒక మిలియనీర్‌ తాను సంపాదించిన డబ్బును తన కంటితో చూడాలనుకున్నాడు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 10 మిలియన్‌ డాలర్లను ఇంటికి తీసుకు వచ్చాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… నైజీరియాకు చెందిన అలికో డాంగోటే అనే బిలియనీర్‌ కింది స్థాయి నుండి ఎదిగాడు. చేతిలో డబ్బు లేని సమయంలో కష్టపడి పని చేసి వ్యాపారంను అభివృద్ది చేసుకున్నాడు. నిర్మాణ రంగంలో నైజీరియాలోనే అతి పెద్ద వ్యాపారవేత్తగా నిలిచాడు.

అలాంటి వ్యక్తికి ఒక చిత్రమైన ఆలోచన వచ్చింది. నేను సంపాదించిన డబ్బు అంతా నేను చూడటం లేదు. లెక్కలు, బుక్కుల్లో మాత్రమే నా డబ్బు కనిపిస్తుంది..

ఇంత సంపాదించిన తాను ఎందుకు ఒకసారి చూసుకోవద్దని భావించాడు. అనుకున్నదే తడువుగా బ్యాంక్‌ నుండి 10 మిలియన్‌ డాలర్లను అంటే ఇండియన్‌ కరెన్సీ ప్రకారం దాదాపుగా 70 కోట్ల రూపాయలను విత్‌ డ్రా చేసుకుని వచ్చాడు.

అంత మొత్తంను ఇచ్చేందుకు బ్యాంకు రెండు రోజుల సమయం అడిగింది. రెండు రోజుల తర్వాత అతడు అడిగిన డబ్బును ఇచ్చింది. అంత డబ్బును కారు డిక్కీలో పెట్టుకుని ఇంటికి తీసుకు వెళ్లాడు.

ఇంట్లో తన రూంలో మొత్తం బయటకు తీసి ఒక కుప్పలా పోశాడు. ఆ డబ్బును రోజంతా కూడా చూస్తూ ఉన్నాడు. ఆ తర్వాత రోజు మొత్తం డబ్బును తీసుకు వెళ్లి బ్యాంకులో డిపాజిట్‌ చేశాడు..

తాను సంపాదించిన డబ్బును చూసుకోకుంటే ఏం ప్రయోజనం, అందుకే నా సంపాదనలో కొద్ది మొత్తంను అయినా కళ్లార చూసుకోవాలని అలా చేశానంటూ ఆశ్చర్యకర సమాధానం చెప్పాడు.