నైజీరియన్ సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన హీరోయిన్  

నైజీరియన్ ముఠా చేతిలో మోసపోయిన వర్ధమాన హీరోయిన్. .

Nigerian Cyber Gang Trapped On Young Heroine Sonakshi Varma-nigerian Cyber Gang, Crime,young Heroine Sonakshi Varma

ఈ మధ్యకాలంలో ఆన్లైన్ వేదికగా చాలామంది సైబర్ నేరాలకు పాల్పడుతున్న సంగతి అందరికి తెలిసిందే. కొంతమంది ముఠాలుగా ఏర్పడి ఆన్లైన్లో జిమెయిల్, ఫోన్ నెంబర్లు సంపాదించి బహుమతులు వచ్చాయని, లాటరీ తగిలిందని నమ్మబలికి తర్వాత జిఎస్టి పేరుతో, అలాగే రకరకాల పన్నులు పేరుతో భారీ మొత్తం దండుకొని తర్వాత కుచ్చుటోపీ పెడుతూ ఉంటారు. ఇలాంటి మోసాలు ఈ మధ్యకాలంలో అంతర్జాల ప్రపంచంలో బాగా ఎక్కువైపోయాయి..

నైజీరియన్ సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన హీరోయిన్-Nigerian Cyber Gang Trapped On Young Heroine Sonakshi Varma

ఎక్కువగా నైజీరియన్ ముఠాలు ఈ రకమైన సైబర్ నేరాలకు పాల్పడుతూ దోపిడి చేస్తున్నాయి. కొంతమంది దేశంలోని ఉన్న సైబర్ నేరగాళ్లు ఆన్లైన్లో ఎలా చాలామందికి డబ్బు ఆశ చూపించి మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇప్పుడు ఓ నైజీరియన్ ముఠా చేతిలో సోనాక్షి వర్మనే వర్ధమాన హీరోయిన్ కూడా చిక్కుకుంది.

కొన్ని నెలల క్రితం మెర్రిన్ కిరాక్ అనే నైజీరియన్ వ్యక్తి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాడు. ఆ రిక్వెస్ట్ మీ భామ ఓకే చేసింది. తర్వాత ఆ నైజీరియన్ తో అప్పుడప్పుడు చాటింగ్ చేస్తూ ఉండేది.

అయితే తాజాగా తను తమ స్నేహానికి గుర్తుగా ఓ బహుమతి పంపిస్తున్నాను అంటూ ఫోన్ చేశాడు. అలా ఫోన్ వచ్చిన కొద్ది రోజులకే ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేస్తున్నావంట వ్యక్తి ఫోన్ చేశారు. నైజీరియా నుంచి వచ్చిందని 85000 ఇస్తే ఆ గిఫ్ట్ పంపుతామని ఆ వ్యక్తి సోనాక్షి వర్మకి ఫోన్ వచ్చింది. అది నిజమని నమ్మిన ఆమె ఎయిర్పోర్ట్ అధికారికి 85000 ట్రాన్స్ ఫర్ చేసింది. అయితే డబ్బులు పంపించి వారం రోజులైనా బహుమతి రాకపోవడంతో తనకు వచ్చిన నెంబర్కు తిరిగి కాల్ చేయగా అది కాస్తా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది.

దీంతో మోసపోయానని గ్రహించి ఆమె సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొత్తానికి ఇప్పుడిప్పుడే సినిమాలో ఎదుగుతున్న ఈ భామ అ నైజీరియన్ ఫ్రెండ్ ని ఫేస్ బుక్ లో నమ్మి అడ్డంగా బుక్కయింది.