అందరిని నవ్వించే ఈ బుడ్డోడి గురించి మీకు తెలుసా?

అందరి జీవితంలో ముఖ్యమైనది పెదవిపై చిరునవ్వు.ఆ చిరునవ్వు కాస్త లేకపోతే జీవితానికి అర్థమే ఉండదు.

 Nigerian Comedian Osita Ihem Life Story-TeluguStop.com

అలా మనం మనమే నవ్వు కోకుండా మనల్ని నవ్వించడానికి ఎంతోమంది కమెడియన్లు ఈ భూమిపై ఉన్నారు.తమ మాటలతో, ముఖ చిత్రాలతో, డాన్సులతో ఇలా ప్రతి ఒక్క విషయంతో నవ్వును అందిస్తారు.

ప్రస్తుతం టీవీ లలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా మనల్ని నవ్వించే వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు.ఇలా ఉంటే సోషల్ మీడియాలో మీమ్స్ తో అదరగొట్టే బుడ్డోడు గురించి తెలుసుకుందాం.

 Nigerian Comedian Osita Ihem Life Story-అందరిని నవ్వించే ఈ బుడ్డోడి గురించి మీకు తెలుసా-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Comedian, Life Story, Nigerian, Osita-Latest News - Telugu

ఈమధ్య సోషల్ మీడియాలో ఓ బుడ్డోడు మీమ్స్, కామెడీ వీడియోస్ ఎక్కువగా వస్తున్నాయి.ఇంతకీ అతను ఎవరంట‌ే.నైజీరియాలో ఇమో స్టేట్ లోని ఎంబైటోలికి చెందిన ఒసిట‌ా ఇహెమ్. ఈయన చూడటానికి చిన్న పిల్లాడిలా ఉంటాడు కానీ ఈయన వయసు దాదాపు 38 సంవత్సరాలు.1982 ఫిబ్రవరి 20న జన్మించాడు.ప్రపంచవ్యాప్తంగా ఈయనకు సోషల్ మీడియాలో అభిమానులు విపరీతం గా ఉన్నారు.

ఈయన లాగోస్ స్టేట్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ చదివాడు.ఈయన టాప్ మోస్ట్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు.

తొలినాళ్ళలో ఆయన యాక్టింగ్ పట్ల చాలా కష్టపడ్డాడు.

ఇక 2003లో ఒసిట‌ా అకినా ఉక్వా అనే హాస్య చిత్రం లో నటించాడు.

అందులో లో ఆయన నటన అందర్నీ ఆకట్టుకుంది.ఈ సినిమాతో ఎన్నో సినిమాల్లో చిన్నపిల్లాడి లా హాస్య పాత్రల్లో నటించాడు.

అంతే కాకుండా బెస్ట్ కమెడియన్ గా పేరు కూడా సొంతం చేసుకున్నాడు.అవార్డులను కూడా గెలుపొందాడు.

నిజానికి ఈయన ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ బాగా ఆకట్టుకుంటాయి.ఈయన వీడియోలను చూసిన ప్రతి ఒక్కరు నవ్వకుండా ఉండలేరని వీడియోలు చూశాకే అర్థమవుతుంది.

#Osita #Life Story #Nigerian #Comedian

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు