ఇస్మార్ట్ పోరితో పవన్ రొమాన్స్.. అయ్యే పనేనా?  

Nidhie Aggarwal To Romance Pawan Kalyan-nidhie Aggarwal,pawan Kalyan,pspk28,telugu Movie News

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతున్నాడు.రీఎంట్రీ గ్రాండ్‌గా ఉండాలని భావించిన పవన్, అందుకు తగ్గట్టుగానే వరుస సినిమాలతో చెలరేగిపోతున్నాడు.

Nidhie Aggarwal To Romance Pawan Kalyan-Nidhie Pawan Kalyan Pspk28 Telugu Movie News

ఇప్పటికే బాలీవుడ్ మూవీ ‘పింక్’ రీమేక్‌లో నటిస్తున్న పవన్ తన తరువాత చిత్రాన్ని దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో చేసేందుకు రెడీ అయ్యాడు.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే అంశంపై సోషల్ మీడియాలో రోజుకో వార్త వినిపిస్తోంది.

ఇటీవల ఈ సినిమాలో పూజా హెగ్డే, కీర్తి సురేష్ లాంటి పేర్లు వినిపించాయి.అయితే వారే కాకుండా బాలీవుడ్ భామల పేర్లు కూడా ఈ జాబితాలో ఉండటంతో ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే అంశం సస్పెన్స్‌గా మారింది.

తాజాగా ఈ జాబితాలో మరో బ్యూటీ వచ్చి చేరింది.ఇస్మార్ట్ శంకర్‌తో అదిరిపోయే సక్సెస్ అందుకున్న బ్యూటీ నిధి అగర్వాల్, పవన్ కళ్యాణ్ సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే దీని కోసం చిత్ర యూనిట్ నిధి అగర్వాల్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది.అమ్మడు కూడా ఓ పెద్ద సినిమా కోసం ఎదురుచూస్తోందని, పవన్ లాంటి స్టార్‌తో సినిమా చేస్తే తన కెరీర్‌కు చాలా ఉపయోగపడుతుందని ఆమె భావిస్తోందట.

మరి పవన్ లాంటి స్టార్ హీరో పక్కన నిధి అగర్వాల్ నటిస్తుందా లేదా అనేది తెలియాలంటే సినిమా ప్రారంభమయ్యే వరకు ఆగాల్సిందే అంటున్నాయి సినీ వర్గాలు.

తాజా వార్తలు

Nidhie Aggarwal To Romance Pawan Kalyan-nidhie Aggarwal,pawan Kalyan,pspk28,telugu Movie News Related....