అభిమానులకి దగ్గర కావడానికి కొత్త రూట్ వేసుకున్న నిధి అగర్వాల్

సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టే అందాల భామలు ఒకటి రెండు సినిమాలు చేయగానే సోషల్ మీడియా ద్వారా వారి పాపులారిటీ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.సినిమాలలో చేసిన ఎక్స్ పోజింగ్ కి మించి హాట్ ఫోటో షూట్ లతో సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు.

 Nidhi Agarwal Started Youtube Channel, Tollywood, Heroines, Celebrity Side Busin-TeluguStop.com

అక్కడ ఫాలోవర్స్ ని విపరీతంగా పెంచుకుంటున్నారు.ఈ కారణంగా సక్సెస్ రేట్ ఎలా ఉన్న, చేసిన సినిమాలు ఎన్ని అయినా హీరోయిన్స్ కి ఉన్న ఫాలోయింగ్ కారణంగా ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటూ ఉంటారు.

ఫోటోషూట్ లకి విపరీతంగా ఆదరణ ఉంటుంది కాబట్టి సోషల్ మీడియాని అందాల భామలు ఒక ఆదాయ మార్గంగా కూడా మార్చుకున్నారు.వారి సోషల్ మీడియా అకౌంట్స్ అయిన పేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ద్వారా కొన్ని వాణిజ్య ఉత్పత్తులు ప్రమోట్ చేస్తూ యాడ్స్ ద్వారా ఆదాయం పెంచుకుంటున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు అందాల భామలు ఫ్యాన్స్ కి మరింత దగ్గర అయ్యేందుకు వారి పాపులారిటీని క్యాష్ చేసుకునేందుకు ఇప్పుడు యూట్యూబ్ ని కూడా వాడేస్తున్నారు.

యూట్యూబ్ లో వారి పేరు మీద ఒక ఛానల్ క్రియేట్ చేసి, దాని ద్వారా వారికి తోచింది, నచ్చింది ఫ్యాన్స్ తో, ఫాలోవర్స్ తో షేర్ చేసుకోవడం, అలాగే వారి సినిమా ముచ్చట్లు, షికార్లు గురించి, వంటలు, ఫ్యాషన్స్ గురించి, మేకప్ కిట్స్ గురించి, స్వీట్ మెమొరీస్ షేర్ చేసుకోవడం మొదలు పెడుతున్నారు.

ఈ విషయంలో సౌత్ భామలు ముందు వరుసలో ఉన్నారు.హాన్సిక ఇప్పటికే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి తన పని మొదలు పెట్టింది.ఇప్పుడు క్రేజీ హాట్ హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది.ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ అభిమానుల‌ను చేరుకోవ‌డానికి ఇదే స‌రైన మార్గ‌మ‌ని తెలిపారు.

నేను ఈ కొత్త వెంచర్ గురించి నిజంగా సంతోషిస్తున్నా.నా అభిమానులు నన్ను చాలా కాలంగా యూట్యూబ్ ఛానెల్‌లో రమ్మని అభ్యర్థిస్తున్నారు.

నా ప్రయాణాన్ని ప్రేక్షకులతో పంచుకోవడం ఆనందంగా ఉంది.వారిని చేరుకోవడానికి ఇదే మంచి మార్గం అని నా అభిప్రాయం.

అభిమానులు నా వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితానికి ఇప్పుడు దగ్గరగా ఉంటారు.నా అభిమానులతో సంబంధం మరింత పెరుగుతుందని నేను అనుకుంటున్నా అని నిధి తాను ఛానల్ స్టార్ట్ చేయడం వెనుక కారణం తెలియజేసింది.

బయటకి ఎన్ని చెప్పిన క్రేజీని క్యాష్ చేసుకోవడానికే అని కొందరు నెటిజన్లు ఈసందర్భంగా కామెంట్స్ కూడా చేస్తున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube