పెద్దలు కుదిర్చిన సంబంధమే చేసుకుంటానంటున్నరామ్ హీరోయిన్…  

Nidhi Agarwal Tollywood Actress Savya Sachi Marriage News Akkineni Nagarjuna Tollywood Bhoomi James Jayam Ravi - Telugu Akkineni Nagarjuna, Bhoomi, James, Jayam Ravi, Marriage News, Nidhi Agarwal, Savya Sachi, Tollywood, Tollywood Actress

టాలీవుడ్ లో అక్కినేని నాగచైతన్య హీరోగా నటించినటువంటి “సవ్యసాచి” అనే చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైనటువంటి బాలీవుడ్ ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ అనతి కాలంలోనే తెలుగు ప్రేక్షకులకి బాగానే దగ్గరయింది.అంతేగాక ప్రస్తుతం తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో వరుస అవకాశాలు దక్కించుకొని బిజీబిజీగా గడుపుతోంది.

 Nidhi Agarwal Tollywood Actress Savya Sachi Marriage News Akkineni Nagarjuna Tollywood Bhoomi James Jayam Ravi

అయితే ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంటికి పరిమితమయిన ఈ అమ్మడు తన అభిమానులతో సోషల్ మీడియాలో చిట్ చాట్ కార్యక్రమంలో పాల్గొంది.

ఇందులో భాగంగా తన అభిమానులు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం ఇచ్చింది.

పెద్దలు కుదిర్చిన సంబంధమే చేసుకుంటానంటున్నరామ్ హీరోయిన్…-Latest News-Telugu Tollywood Photo Image

అయితే ఇందులో ముఖ్యంగా నెటిజన్ మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారా .? లేదా పెద్దలు కుదిర్చినటువంటి పెళ్లి చేసుకుంటారా.? అని అడిగాడు.దీంతో నిధి అగర్వాల్ స్పందిస్తూ తాను పెద్దలు కుదిర్చిన సంబంధమే చేసుకుంటానని రిప్లై ఇచ్చింది.

అలాగే టాలీవుడ్ పవర్ స్టార్ మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురించి ఒక్క మాటలో చెప్పాలని మరో నెటిజన్ అడిగాడు.

దీంతో నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి ఒక మంచి గిఫ్ట్ అని రిప్లై ఇచ్చింది.

దీంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు నిధి అగర్వాల్ కి ధన్యవాదాలు చెబుతున్నారు.అలాగే సినీ పరిశ్రమలో మీకు ఎవరు పోటీ అని మరో నెటిజన్ అడగ్గా, ప్రస్తుతం సినీ పరిశ్రమలో అందరూ బాగా రాణిస్తున్నారని, అయితే వారు తమదైన శైలిలో దూసుకుపోతున్నారని కాబట్టి తానెప్పుడూ ఇంకొకరికి పోటీ అనుకొనని తెలిపింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నిధి అగర్వాల్ కోలీవుడ్ లో “భూమి” అనే చిత్రంలో నటిస్తోంది.ఈ చిత్రంలో హీరోగా కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి హీరోగా నటిస్తున్నాడు.

అయితే కన్నడలో కూడా ప్రముఖ దర్శకుడు చేతన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న జేమ్స్ అనే చిత్రంలో నటిస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tollywood Heroine Nidhi Agarwal Reveals Secret About Her Marriage Related Telugu News,Photos/Pics,Images..