రవితేజతో రొమాన్స్ చేయబోతున్న మరో ఇస్మార్ట్ భామ

మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా పూర్తయిన వెంటనే రమేష్ వర్మ దర్శకత్వంలో సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్తున్నాడు.

 Nidhi Agarwal Romance With Raviteja In Ramesh Varma Film-TeluguStop.com

ఈ సినిమాకి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతుంది.ఇక ఈ సినిమాలో రవితేజ కోసం హీరోయిన్స్ ఎంపికపై దర్శక నిర్మాతలు దృష్టిపెట్టారు.

అందులో భాగంగా ఇద్దరు హీరోయిన్స్ ఉన్న ఈ సినిమాలో ఒకరిని ఎంపిక చేసారు.సవ్యసాచి, ఇస్మార్ట్ శంకర్, మిస్టర్ మజ్ను సినిమాలతో టాలీవుడ్ క్లో సందడి చేసిన బెంగుళూరు భామ నిధి అగర్వాల్ ని ఈ సినిమాలో హీరోయిన్ గా ఫైనల్ చేసినట్లు అఫీషియల్ గా ప్రకటించారు.

కథ ప్రకారం సినిమాలు రవితేజకి ఇద్దరు హీరోయిన్స్ అవసరం ఉన్న నేపధ్యంలో గ్లామర్ క్వీన్ గా దూసుకుపోతున్న నిధి అగర్వాల్ ని ఫస్ట్ ఛాయస్ గా ఎంపిక చేశారు.హవీష్ ప్రొడక్షన్ పై కోనేరు సత్యనారాయణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

రవితేజ స్టైల్ లో మాస్ కమర్షియల్ మూవీగా ఇది ఉండబోతుందని తెలుస్తుంది.ఇస్మార్ట్ శంకర్ తో హిట్ కొట్టిన నిధి అగర్వాల్ చేసిన మూడు సినిమాలలో రెండు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి.

మరి అసలే వరుస ఫ్లాప్ లతో ఉన రవితేజ అయిన ఈమెని సాలిడ్ హిట్ ఇచ్చి స్టార్ హీరోయిన్ చేస్తాడేమో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube