రెండు బ్రెడ్‌ ముక్కలకు ఇంత పబ్లిసిటీ అవసరమా నిధి?  

Nidhi Agarwal Netizens Lock Down - Telugu Bread Pockets, Coronavirus, Funny Comments, Lock Down, Netizens Trolls, Nidhi Agarwal, Tollywood

నిధి అగర్వాల్‌ ఇటీవల వలస కార్మికులు మరియు రోడ్డు మీద తిండి లేక అల్లాడుతున్న వారి కోసం అంటూ బ్రెడ్‌ జామ్‌ ను ఇచ్చింది.అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పెట్టింది.

 Nidhi Agarwal Netizens Lock Down

నిధి అగర్వాల్‌ రెండు బ్రెడ్‌ స్లైస్‌లు మరియు జామ్‌ ను కాస్త కలిసి ఒక ప్యాకెట్‌లో పెట్టి ఇచ్చింది.ఆ విషయం ఆ ఫొటో చూసిన ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది.

ఆమె సేవ గుణం గురించి కొందరు నెటిజన్స్‌ ట్రోల్స్‌ చేసి చుక్కలు చూపుతున్నారు.

రెండు బ్రెడ్‌ ముక్కలకు ఇంత పబ్లిసిటీ అవసరమా నిధి-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

నువ్వు ఇచ్చే రెండు బ్రెడ్‌ ముక్కలకు మరీ ఇంత పబ్లిసిటీ అవసరమా అంటూ అవహేళన చేశారు.

కేవలం రెండు అంటే రెండు బ్రెడ్స్‌ ఇస్తే ఆకలితో అలమటిస్తున్న వారికి ఏం సరిపోతుంది.మళ్లీ నువ్వు ఏదో గొప్ప గనకార్యం చేసినట్లుగా సోషల్‌ మీడియాలో ఫొటోలు పెట్టడం, ఆ ఫొటోలో కష్టపడి పోతున్నట్లుగా ఫోజ్‌లు ఇవ్వడం అంటూ కొందరు కాస్త ఘాటుగానే విమర్శలు గుప్పించారు.

ఒకొక్కరికి కనీసం 10 రూపాయల ఆహారం కూడా నువ్వు ఇవ్వలేదు కాని నీ తీరు చూస్తుంటే మాత్రం ఒకొక్కరికి బిర్యానీ ఇచ్చినంతగా పబ్లిసిటీ చేసుకున్నావు అంటూ కామెంట్స్‌ చేశారు.కనీసం ఒకొక్కరికి బ్రెడ్‌ ప్యాకెట్‌ ఇచ్చినా బాగుండేది.అందులో రెండు బ్రెడ్‌ స్లైస్‌లు ఇచ్చి నీవు ఇస్తున్న పోజులు మామూలుగా లేవు అంటూ మరికొందరు ఫన్నీగా కామెంట్స్‌ చేశారు.మొత్తానికి ఈ అమ్మడు చేసిన ఈ బ్రెడ్‌ దానం చివరకు ఆమెకే విమర్శలు తెచ్చి పెట్టింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nidhi Agarwal Netizens Lock Down Related Telugu News,Photos/Pics,Images..

footer-test