"హీరో" సినిమాలో పర్మార్మెన్స్ తో ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్న టాలెంటెడ్ హీరోయిన్ నిధి అగర్వాల్

తన కొత్త సినిమా “హీరో“తో ప్రేక్షకులను ఫిదా చేసేస్తోంది అందాల తార నిధి అగర్వాల్.గల్లా అశోక్ డెబ్యూ ఫిల్మ్ గా వచ్చిన హీరో చిత్రంలో నిధి గ్లామర్, నటన ఆకట్టుకుంటోంది.

హీరో విజయంతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది నిధి అగర్వాల్.ఈ సినిమాలో నిధి పర్మార్మెన్స్ పై ప్రేక్షకులే కాదు చిత్ర పరిశ్రమలోని పలువురు ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.

 Nidhi Agarwal Is A Talented Heroine Who Is Receiving Celebrity Acclaim With Her Performance In The Movie

నటుడు జగపతి బాబు తనకు మళ్లీ హీరో కావాలని కోరిక ఉందని, ఎందుకంటే తనకు హీరోయిన్ గా నిధి అగర్వాల్ దొరికే అవకాశం ఉండొచ్చని చెప్పారు.నిధి అందంగా ఉండటమే కాదు థియేటర్లో తన పర్మార్మెన్స్ కు  వస్తున్న అప్లాజ్ ఆకట్టుకుందని చెప్పారు.

మరో నటుడు నరేష్ అయితే నిధి అగర్వాల్ కున్న క్రేజ్ చూస్తుంటే మళ్లీ జన్మలో ఆమెలా పుట్టాలని ఉందని అన్నారు.నిధి అంటే సందప అని ఆమెను హీరోయిన్ గా పెట్టుకున్న సినిమాలన్నీ సూపర్ కలెక్షన్స్ రాబడుతున్నాయని బ్రహ్మాజీ చెప్పారు.

హీరో సుధీర్ బాబు, దర్శకులు అనిల్ రావిపూడి, కొరటాల శివ కూడా నిధి స్క్రీన్ ప్రెజన్స్ ను, ఆడియెన్స్ లో ఉన్న క్రేజ్ ను మెచ్చుకున్నారు.

Telugu Ashok Galla, Jagapathi Babu, Koratala Shiva, Naresh, Nidhi Agarwal, Sankranthi, Sudheer Babu, Tollywood-Latest News - Telugu

తెలుగులో నాగచైతన్యతో సవ్యసాచి చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అఖిల్ సరసన మిస్టర్ మజ్నూ లో నటించింది.రామ్, పూరీ జగన్నాథ్ ల ఇస్మార్ట్ శంకర్ తో ఫస్ట్ సక్సెస్ అందుకుని తెలుగు తమిళ ఇండస్ట్రీలను ఆకర్షించింది.ఆ తర్వాత తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది.

సంక్రాంతి పండగ ఈ టాలెంటెడ్ హీరోయిన్ కు బాగా కలిసొచ్చింది.పండక్కి విడుదలైన గల్లా అశోక్ హీరో సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.ఈ సినిమాలో నిధి అగర్వాల్ చేసిన సుబ్బు క్యారెక్టర్ ను ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు.హీరో చిత్రంలో నిధి పర్మార్మెన్స్ తో పాటు గ్లామర్ కు యూత్ ఆడియెన్స్ ఫాంటసీలో పడిపోతున్నారు.

నిధి లిస్టులో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకుడు క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు చిత్రంలో నాయికగా కనిపించబోతోంది నిధి అగర్వాల్.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube