35సార్లు పరీక్షలు చేయించుకున్న నిధి అగర్వాల్.. ఏమైందంటే..?

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ మొదలు కావడంతో రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే.కేసులు మరింత పెరిగితే లాక్ డౌన్ విధించకపోయినా నిబంధనలు కఠినంగా అమలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి.

 Nidhi Agarwal Interesting Comments About Covid Tests, Covid Tests, Harihara Veer-TeluguStop.com

యంగ్ హీరోయిన్ లలో ఒకరైన నిధి అగర్వాల్ ఏకంగా 35 సార్లు కరోనా పరీక్షలు చేయించుకున్నారట.ఒక జాతీయ పత్రికతో మాట్లాడుతూ నిధి అగర్వాల్ ఈ విషయాలను వెల్లడించారు.

పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే.కరోనా విజృంభణ వల్ల గతేడాది లాక్ డౌన్ నిబంధనలు అమలు కావడంతో ఆరు నెలలు తాను ఇంటికే పరిమితమయ్యానని.

షూటింగ్ లు లేకపోవడం వల్ల తనను వైరాగ్యం ఆవరించిందని ఆమె పేర్కొన్నారు.దాదాపు ఆరు నెలల తర్వాత షూటింగ్ లో అడుగు పెట్టడం తనలో భయం కలిగించిందని నిధి పేర్కొన్నారు.

లాక్ డౌన్ నిబంధనలు ఎత్తివేసిన సమయంలో బెంగళూరు హైదరాబాద్ నగరాల మధ్య తిరగాల్సి వచ్చిందని.ఆరు నెలల సమయంలో ఏకంగా 35సార్లు కరోనా పరీక్షలు చేయించుకున్నానని నిధి తెలిపారు.

గతేడాది అక్టోబర్ నుంచి షూటింగ్ లో పాల్గొంటున్నానని సినీ పరిశ్రమ మళ్లీ వరుస షూటింగ్ లతో కళకళలాడటం ఎంతో సంతోషంగా ఉందని నిధి అగర్వాల్ పేర్కొన్నారు.

Telugu Covid, Nidhi Agarwal-Movie

హరిహర వీరమల్లు సినిమా మేకప్ కోసం ఏకంగా గంటన్నర సమయం పడుతుందని నిధి అగర్వాల్ చెప్పుకొచ్చారు.హైదరాబాద్ పరిసరాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా నిధి అగర్వాల్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తూ ఉండటం గమనార్హం.వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పవన్ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube