అభిమానుల కారణంగా అసహనానికి గురైన నిధి అగర్వాల్

సినిమా తారలు అంటే బయట ఎక్కువగా ఆసక్తి, ఆకర్షణ ఉంటుంది.తెరపై కనిపించిన వాళ్ళు మన మధ్యకి వస్తున్నారు అంటే వారిని చూడాలని, కలవాలని, మాట్లాడాలని అభిమానులు తెగ ఉత్సాహం చూపిస్తూ ఉంటారు.

 Nidhhi Agerwal Suffered With Her Fans-TeluguStop.com

హీరోల విషయంలో ఈ అభిమానం కొంత హద్దులు దాటినా దానిని వారు మేనేజ్ చేసుకోగలరు.కానీ హీరోయిన్ల విషయంలో అభిమానం శృతి మించితే వారు అసహనానికి గురవుతారు.

కొందరు అభిమానం ముసుగులో హీరోయిన్లని తాకేందుకు అత్యుత్సాహం చూపిస్తూ ఉంటారు.అలాగే వేయకూడని చోట చేతులు వేయడానికి ప్రయత్నం చేస్తారు.

 Nidhhi Agerwal Suffered With Her Fans-అభిమానుల కారణంగా అసహనానికి గురైన నిధి అగర్వాల్-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలాంటి సమయంలో అభిమానుల కారణంగా అసహనానికి చాలా మంది సెలబ్రెటీలు గురయ్యారు.హీరోయిన్లు ఎక్కువగా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కి వెళ్తూ ఉంటారు.

అలాంటి సమయంలో, అలాగే అవుట్ డోర్ షూటింగ్ చేసే సమయంలో ఇలా అభిమానుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటారు.తాజాగా నిధి అగర్వాల్ కి కూడా అలాంటి అనుభవమే ఎదురైంది.

ప్రస్తుతం ఈ భామ తెలుగులో గల్లా అశోక్ కి జోడీగా ఒక సినిమాలో చేస్తుంది.శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రాజమండ్రిలో జరుగుతుంది.అయితే షూటింగ్ సందర్భంగా నిధి అగర్వాల్ అక్కడ ఉందని తెలుసుకున్న అభిమానులు ఎక్కువ మంది ఆమెని చూడటానికి వచ్చారు.

బౌన్సర్లు ఉన్న కూడా వందలాది మంది అభిమానులు నిధి అగర్వాల్ దగ్గరకి వచ్చి ఆమెని సమీపించే ప్రయత్నం చేస్తారు.కొందరు ఆమెని తాకడానికి ప్రయత్నించారు.మరికొందరు ఆమెతో సెల్ఫీలు దిగే ప్రయత్నం చేశారు.అయితే ఇలా సెల్ఫీలు తీసుకునే క్రమంలో ఓ వ్యక్తి జారిపోయి క్రిందపడటంతో నిధి అగర్వాల్ కూడా కంగారు పడింది.

ఈ వీడియోని ఎవరో సోషల్ మీడియాలో షేర్ చేశారు.అభిమానుల మధ్యలో నిధి అగర్వాల్ ఎంత ఇబ్బంది పడిందో ఆ వీడియోలో కనిపిస్తుంది.

#Sriram Aditya #Galla Ashok #Rajahmundry #Nidhi Agarwal

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు