పట్టిస్తే లక్ష రూపాయలు ఇస్తాను.. నిధి అగర్వాల్ పోస్ట్ వైరల్..?

కెరీర్ తొలినాళ్లలో యంగ్, మిడిల్ రేంజ్ హీరోలతో ఎక్కువగా నటించిన నిధి అగర్వాల్ కు ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో వరుస ఆఫర్లు వస్తున్నాయి.పవన్ క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హరిహరవీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్ మెయిన్ హీరోయిన్ కావడం గమనార్హం.

 Nidhhi Agerwal Post Goes Viral In Social Media-TeluguStop.com

ఈ సినిమాతో పాటు నిధి అగర్వాల్ మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

అయితే తాజాగా నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టగా ఆ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ పెట్ తప్పిపోయిందని ఆ పెట్ ను ఎవరైనా పట్టించి ఇస్తే వాళ్లకు ఏకంగా లక్ష రూపాయలు ఇస్తానని ప్రకటించారు. ఇస్మార్ట్ బ్యూటీ పెట్ కు సంబంధించిన ఇతర వివరాలతో పాటు కాంటాక్ట్ నంబర్లను జత చేశారు.

 Nidhhi Agerwal Post Goes Viral In Social Media-పట్టిస్తే లక్ష రూపాయలు ఇస్తాను .. నిధి అగర్వాల్ పోస్ట్ వైరల్…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ ఇండస్ట్రీతో పాటు కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నిధి అగర్వాల్ కు ఆఫర్లు వస్తున్నాయి.

తమిళంలో శింబు, జయం రవి మరి కొంతమంది హీరోలకు జోడీగా నిధి అగర్వాల్ కు సినిమా ఆఫర్లు వస్తున్నాయి.

హరిహర వీరమల్లు సినిమా హిట్ అయితే మాత్రం నిధి అగర్వాల్ కు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.ప్రస్తుతం నటిస్తున్న సినిమాలతో పాటు గల్లా అశోక్ హీరోగా తెరకెక్కుతున్న మరో సినిమాలో కూడా నిధి అగర్వాల్ నటిస్తుండటం గమనార్హం.

ఇప్పటివరకు గ్లామర్ రోల్స్ లో ఎక్కువగా నటించిన నిధి క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో మాత్రం కొత్తగా కనిపించనున్నారు.ఈ సినిమాలో నిధి అగర్వాల్ రాణి పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది.

వచ్చే ఏడాది ఈ మూవీ రిలీజ్ కానుంది.

#NiddhiAgerwal #Nidhhi Agerwal #1 Lakh Rupees #Post Goes Viral #One Lakh Reward

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు