మహేష్ త్రివిక్రమ్ మూవీలో ఇస్మార్ట్ బ్యూటీ..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వం లో ‘సర్కారు వారి పాట‘ సినిమా చేస్తున్నాడు.సరిలేరు నీకెవ్వరూ సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకుని అదే జోష్ లో ఈ సినిమా మొదలు పెట్టాడు.

 Nidhhi Agarwal In Mahesh Babu Trivikram Movie-TeluguStop.com

ఈ సినిమాలో మహేష్ బాబుకు జంటగా కీర్తి సురేష్ నటిస్తుంది.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేస్తునట్టు ప్రకటించాడు.వీరి ఇద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి.అతడు సూపర్ హిట్ అవ్వగా ఖలేజా మాత్రం ఆకట్టుకోలేక పోయింది.అయితే ఈ రెండు సినిమాలు మహేష్ బాబు లోని మరొక కోణాన్ని బయటకు తీసుకొచ్చాడు త్రివిక్రమ్.

 Nidhhi Agarwal In Mahesh Babu Trivikram Movie-మహేష్ త్రివిక్రమ్ మూవీలో ఇస్మార్ట్ బ్యూటీ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమాను త్రివిక్రమ్ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించ బోతున్నాడని వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమాను సూపర్ హిట్ చేయాలనీ త్రివిక్రమ్ గట్టి పట్టుదలతో ఉన్నాడు.

Telugu Director Parashuram, Hari Hara Veeramallu, Hat Trick Movie, Keethy Suresh, Mahesh And Nidhi Agarwal, Mahesh Babu, Mahesh Movie Update, Nidhhi Agerwal, Nidhhi Agerwal In Mahesh Babu Trivikram Movie, Pawan Kalyan, Sarkaru Vari Paata, Ssmb28, Trivikram-Movie

ఈ సినిమా హాసిని అండ్ హారిక సినిమాస్ బ్యానర్ నిర్మిస్తుంది.ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ఏదొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.తాజాగా ఈ సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఈ అమ్మడికి ఈ మధ్యనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో ఛాన్స్ వచ్చింది.

తాజాగా మహేష్ సినిమాలో కూడా నటించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది.ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించే అవకాశం ఉంది.ఒక హీరోయిన్ గా పూజ పేరు వినిపిస్తుంటే మరొక హీరోయిన్ గా నిధి పేరు వినిపిస్తుంది.ముందుగా జాన్వీ కపూర్ ను సంప్రదించాలని అనుకుంటున్నారు.

ఒకవేళ జాన్వీ నో చెబితే ఆ ఛాన్స్ నిధికి వస్తుందని టాక్.

#MaheshMovie #NidhhiAgerwal #Mahesh Babu #HariHara #Hat Trick Movie

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు