ఐదో పెళ్లి చేసుకున్న ఘోస్ట్ రైడర్ సినిమా హీరో

ఇండియాలో వివాహ వ్యవస్థకి సమాజంలో ఒక గౌరవం ఉంది.ఈ నేపధ్యంలో పెళ్లి తర్వాత చాలా మంది ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కలిసి బ్రతకడానికే భార్య భర్తలు ఆలోచిస్తూ ఉంటారు.

 Nicolas Cage Ties The Knot For The Fifth Time To Riko Shibata-TeluguStop.com

అయితే విదేశాలలో వివాహ వ్యవస్థ అంత బలంగా లేకపోవడం, అలాగే విడాకులు కోరుకున్న వెంటనే చట్టాలు కూడా ఎక్కువగా ప్రశ్నలు వేయకుండా చిన్న చిన్న కారణాలకె విడాకులు మంజూరు చేసేస్తూ ఉంటాయి.అయితే ఇండియాలో పెళ్లి చేసుకోవడం ఓ సంబరం అయితే విడాకులు తీసుకోవడం అనేది పెద్ద యుద్ధమని చెప్పాలి.

విడాకులు తీసుకోవడానికి ఇద్దరూ బలమైన కారణాలు చెప్పగలగాలి.అయితే ఈ మధ్యకాలంలో ఇండియాలో కూడా చాలా సింపుల్ గా విడాకులు తీసేసుకుంటున్నారు.

 Nicolas Cage Ties The Knot For The Fifth Time To Riko Shibata-ఐదో పెళ్లి చేసుకున్న ఘోస్ట్ రైడర్ సినిమా హీరో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

విడాకులు తీసుకున్న తర్వాత మరో వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కు అన్ని చోట్ల ఉంది.అయితే ఇండియాలో ఇద్దరి కంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకున్న సందర్భాలు ఉండవు.

అరుదుగా మూడు సార్లు పెళ్లి చేసుకున్న వ్యక్తులు ఉన్నారు.అంతకు మించి అంటే వారిని నిత్య పెళ్ళికొడుకు అనే ముద్ర వేసేస్తారు.

సెలబ్రిటీలు అలా చేసుకుంటే వారిని నిత్యం ట్రోల్ చేస్తూ ఉంటారు.అయితే విదేశాలో ఎంత మందిని అయిన పెళ్లి చేసుకోవచ్చు.

ఎన్ని సార్లయినా పెళ్లి చేసుకోవచ్చు.హాలీవుడ్ నటులే ఇలా ఐదు, ఆరు పెళ్ళిళ్ళు చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి.

హాలీవుడ్ లో ఓ హీరోయిన్ అయితే ఏకంగా ఎనిమిదిని పెళ్లి చేసుకొని రికార్డ్ క్రియేట్ చేసింది.తాజాగా హాలీవుడ్ నటుడు, ఆస్కార్ అవార్డ్ విన్నర్, ఘోస్ట్ రైడర్ సిరీస్ తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన నికోల‌స్ గేజ్ ఇటీవ‌ల త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్ రికో ష‌బీనాను ఐదో వివాహం చేసుకున్నాడు.

లాస్ వేగ‌స్‌లోని ఓ హోట‌ల్‌లో ఫిబ్ర‌వ‌రి వీరిద్ద‌రి వివాహం జ‌రిగింది.నికోలాజ్ వయస్సు 56 లాగా అతని గర్ల్ ఫ్రెండ్ రికో వయస్సు 26 మాత్రమే.

ఇక వీరి పెళ్లికి అతని నాలుగో మాజీ భార్య, పిల్లలు కూడా హాజరు కావడం విశేషం.

#NicolasCage #Riko Shibata #Hollywood #Nicolas Cage

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు