‘నిక్లోసమైడ్’.. మార్కెట్లోకి మరో వ్యాక్సిన్

ప్రపంచ వ్యాప్తంగా శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ఇప్పటికే పలు దేశాల్లో అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి.పలు దేశాల శాస్త్రవేత్తలు రేయింబవళ్లు శ్రమించి వ్యాక్సిన్ కి అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

 Niclosamide, Vaccine, Market-TeluguStop.com

ఈ మేరకు ఇప్పటికే కొన్ని వ్యాక్సిన్లు కూడా వచ్చాయి.తాజాగా మ్యాన్ కైండ్ ఫార్మా సంస్థ కొత్త వ్యాక్సిన్ ని తయారు చేసింది.

కరోనాను నియంత్రించడానికి కొత్త ఫార్ములేషన్ తో తయారు చేసిన ‘నిక్లోసమైడ్’ ఔషధంతో మ్మాన్ కైండ్ ఫార్మా ప్రయోగాలు చేపట్టనుంది.దీనికి సంబంధించి మొదటి ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ ను కూడా ప్రారంభించనుంది.

క్లినికల్ ట్రయల్స్ కి సంబంధించి ఇప్పటికే దక్షణ కొరియన్ కంపెనీ దేవూంగ్ ఫార్మాసూటికల్స్ తో కూడా ఒప్పందాన్ని కుదుర్చుకుంది.ఈ వ్యాక్సిన్ కి సంబంధించి ప్రీ క్లినికల్ ట్రయల్స్ ను కూడా నిర్వహించినట్లు, పరీక్షల్లో మంచి ఫలితాలు కనిపించినట్లు మ్యాన్ కైండ్ ఫార్మా సంస్థ వెల్లడించింది.

నిక్లోసమైడ్ వ్యాక్సిన్ తో కరోనా మహమ్మారిని చెక్ పెట్టెందుకు రెడీ అవుతున్నారు మ్యాన్ కైండ్ సంస్థ.కాగా, ఇండియాలో కూడా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు డీసీజీఐ అనుమతి లభించినట్లు మ్యాన్ కైండ్ సంస్థ సీఓఓ అర్జున్ జునేజా ప్రకటించారు.

ఈ క్లినికల్ ట్రయల్స్ సక్సెస్ అయితే కరోనాను నిర్మూలించవచ్చని సీఓఓ అర్జున్ జునేజా వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube