కరోనా కి బలైన హాలీవుడ్ నటుడు!

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసేస్తుంది.ఈ మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది.

 Hollywood Actor Nick Cordero Passed Away With Covid-19, Hollywood ,nick Cordero,-TeluguStop.com

ఈ క్రమంలోనే హాలీవుడ్‌లో కరోనా తీవ్ర విషాదాన్ని నింపింది.ప్రముఖ నటుడు నిక్ కార్డెరో(41) కన్నుమూసినట్లు తెలుస్తుంది.

గత 90 రోజులుగా కరోనా వ్యాధితో పోరాడుతున్న ఆయన చివరకు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.ఇటీవల అనారోగ్యం తో బాధపడుతున్న నిక్ ను లాస్ ఏంజిల్స్ లోని సెడార్స్ సినాయ్ మెడికల్ సెంటర్ లో చికిత్స పొందుతున్నారు.

అదే సమయంలో అతడి కుడికాలి లో రక్తం గడ్డ కట్టడం తో కాలిని సైతం తొలిగించిన సంగతి తెలిసిందే.అయితే శాస్త్ర చికిత్స అనంతరం కాలు తొలగించినప్పటికీ కూడా కరోనా తో పోరాడడానికి సిద్దమైనప్పటికీ కరోనా విషయంలో ఓడిపోయాడు.

దీనితో గత 90 రోజులుగా చికిత్స పొందుతున్న నిక్ చివరికి ఆ కరోనా మహమ్మారికి బలైపోయినట్లు తెలుస్తుంది.తక్కువ వయసులోనే కరోనా కారణంగా ఆయన చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.

అతని మరణంపై హాలీవుడ్ సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.నిక్ కార్డెరో మరణం గురించి ఆయన భార్య సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

ఇటీవల అనారోగ్యంతో నిక్ లాస్ ఏంజిల్స్‌లోని సెడార్స్ సినాయ్ మెడిక‌ల్ సెంట‌ర్‌లో చేరారు.ఓ వైపు చికిత్స పొందుతూనే పరిస్థితి విషమించడం తో చనిపోయినట్లు తెలుస్తుంది.కెనడాకు చెందిన నిక్ రంగ స్థల పాత్రలతో మంచి పేరు తెచ్చుకున్నాడు.

2014 బ్రాడ్‌వే మ్యూజికల్ బుల్లెట్స్ ఓవర్ బ్రాడ్‌వేలో నటించినందుకు సంగీతంలో ఉత్తమ నటుడిగా టోనీ అవార్డుకు ఎంపికయ్యారు.రెండుసార్లు డ్రామా డెస్క్ అవార్డులకు కూడా ఎంపికయ్యాడు.రాక్ ఆఫ్ ఏజెస్‌, వెయిట్ర‌స్‌, ఎ బ్రాంక్స్ టేల్ వంటి ప‌లు చిత్రాల్లోనూ న‌టించారు.బుల్లితెర‌పై వ‌చ్చే బ్లూ బ్ల‌డ్స్, లా అండ్ ఆర్డ‌ర్‌ సిరీస్‌లోనూ క‌నిపించిన విషయం విదితమే

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube