Bhanupriya : సెంటు వాడకపోయినా భానుప్రియ నుంచి సువాసన ఎందుకు వచ్చేది ?

సాంధ్యశ్రీ.ఈయన ఒక కవి మరియు విమర్శకుడు.

 Nice Smell Come From Heroine Bhanu Priya-TeluguStop.com

అయన ఒక విషయం పై మాట్లాడుతూ భానుప్రియ గురించి గుర్తు చేసుకున్నారు.ఆమె వొంటి నుంచి ఒక అద్భుతమైన, గాఢమైన పరిమళం ఒకటి వస్తు ఉంటుందట.

ఈ విషయం అయన మాత్రమే కాదు అంతకు ముందు ఒక దర్శక దిగ్గజం కూడా చెప్పినట్టు గుర్తు.ఒకసారి రామానాయుడు స్టూడియో(Ramanaidu Studio)లో కె విశ్వనాథ్(K Vishwanath) గారితో మాట మంతి జరుపుతున్నారు నిర్మాత రామానాయుడు.

ఆ సమయం లో కార్ లో నుంచి భానుప్రియ (bhanu priya)దిగి డైరెక్టర్ మరియు నిర్మాత దగ్గరికి వెళ్తుందట.ఆమె వస్తుంటే ఒక పరిమళం ఆమె కన్నా ఒక అడుగు ముందే అందరి ముక్కును తాకింది.

అయితే ఆమె సెంటు, పెర్ఫ్యూమ్(Perfume) కానీ కొట్టుకోలేదు.మరి ఆ వాసనా ఎలా వచ్చింది అనేది ఒక అద్భుతం.అది సువాసన వెదజల్లుతున్న సహజ వాసన అని చెప్పఁడానికి పెద్ద టైం పట్టలేదు.పైగా ఆమె ఒంటికి సబ్బు కూడా పెట్టుకోకుండా కేవలం సున్ని పిండి తోనే స్నానం చేస్తుందట.

సౌందర్య సాధనాలు ఆమెకు ఎలర్జీ అని అందుకే తలస్నానం చేసిన షాంపూ లాంటివి వాడకుండా కుంకుడు కాయ తోనే చేస్తుందట.సౌందర్య ఉత్పత్తులకు ఆమె చాల దూరం.

భాను ప్రియా స్నేహితులు, దగ్గరగా ఉండేవాళ్ళు కూడా ఇదే చెప్తారు.ఆమె పక్కన కూర్చుంటే ఎంతో మంచి సువాసన వస్తు ఉంటుందట.

ఆ రహస్యం ఏంటి అని భాను ప్రియా ను చాలామంది అడిగిన కూడా ఆమెకు కూడా ఆ విషయం తెలియదు అని చెప్పేది.అయితే అసలు విషయం ఏమిటి అంటే ఇలా శరీరం నుంచి పరిమళ సుగంధం లాగ సువాసన వస్తుంటే వారిని పద్మగంది అంటే అంటారట.పద్మం వంటి సువాసన గంధం విరజిమ్ముతూ ఉంటారట ఈ జాతి స్రీలు.సాదరంగా దేవతలకు, అప్సరసలు మాత్రమే ఇలాంటి సువాసన కలిగి ఉంటారట.కానీ ఒక సినీ నటి గురించి ఇలా చాల మంది కథలు కథలుగా చెప్పుకోవడం అంటే నిజముగా పెద్ద విషయమే.ఇక ప్రస్తుతం భానుప్రియ మెమొరీ లాస్ తో బాధపడుతూ సినిమా రంగానికి కూడా దూరంగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube