దూకుడు పెంచిన ఎన్ఐఏ..ఏమిజరగబోతోంది..??

జగన్ కోడి కత్తి ఘటన ఎంతటి సంచలనం సృష్టించిందో వేరే చెప్పనవసరంలేదు.కత్తితో పొడిచినోడు , గాయంతో మంచం పాలై కోలుకున్న జగన్ ఇద్దరూ బాగానే ఉన్నారు.

 Nia Speedups Case Of Attack On Ys Jagan-TeluguStop.com

కాని మధ్యలో నలుగుతోంది మాత్రం టీడీపీనే ఎందుకంటే ఆసమయంలో చంద్రబాబు నాయుడు , ఆయన నేతలు, యంత్రంగా చేసిన కామెంట్స్ వలన ఈరోజు టీడీపీ పార్టీ ఇరకాటంలో పడింది.అసలు జగన్ పై దాడి ఎలా జరిగింది.

ఎందుకు జరిగింది , ఎవరు చేయించారు అనే వివరాలల్ని ఆలోచించాల్సిన తరుణంలో టీడీపీవైపే అందరి వేళ్ళు చూపించడం ఆ పార్టీకి భారీ మైనస్ అనే చెప్పాలి.

ఇదిలాఉంటే టీడీపీ వేసిన సిట్ సరైన విచారణ చేపట్టడం లేదంటూ కోర్టులకి ఎక్కడం, కోర్టు ఎన్ఐఏ కి కోడి కత్తి కేసు భాద్యతలు అప్పగించడం.ఎన్ఐఏ ఏపీలో ఎంట్రీ అవ్వడాన్ని సైతం బాబు తప్పు పట్టడం ప్రజలలో టీడీపీ పై మరింత చులకన భావాన్ని కలిగించాయి.ఇక ఎన్ఐఏ దూకుడు చూసిన టీడీపీ నేతల్లో గుబులు మొదలయ్యింది.

దానికి తగ్గట్టుగా విచారణలో హత్యాయత్నం నిజంగా డ్రామా అయితే ఎన్ఐఏ తెల్చితే అప్పుడు తమకే కదా నష్టం మీరు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు అంటూ వైసీపీ వేస్తున్న ప్రశ్నలు ప్రజలో మరిన్ని అనుమానాలు రాజేస్తున్నాయి.

ఇక అందరూ ఊహించినట్టుగానే ఎన్ఐఏ టిడిపి కీలక నేత హర్షవర్ధన్ చౌదరికి నోటీసులు ఇవ్వడంతో టీడీపీ నేతల్లో కలకలం రేగింది.ఇప్పుడు ఎన్ఐఏ జరిపే తనదైన విచారణలో గనుకా హర్ష వర్ధన్ నుంచీ వాస్తవాలు రాబట్టకలిగితే చంద్రబాబుకు ఇబ్బందులు తప్పవని అంటున్నారు.ఒక వేళ జరగరానిది జరిగితే మా రాజకీయ భవిష్యత్తు ఏమి కాను అంటూ టీడీపీ నేతలు తెగ టెన్షన్ పడుతున్నారు.

అయితే ఎన్నికలు ముంగిట ఉన్న వేళ ఎన్ఐఏ పెంచిన దూకుడు టీడీపీ పై తీవ్ర ప్రభావాని చూపటం ఖాయమని అయితే చంద్రబాబు వ్యూహాత్మకంగా పరిస్థితులని ఎదుర్కోవాలే కాని ఇలా ఎన్ఐఏ ఎంట్రీ పై కామెంట్స్ చేయడం మొదటికే మోసం వస్తుందని అంటున్నారు వి శ్లేషకులు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube