స్పీడ్ పెంచిన ఎన్ ఐ ఏ ... అయినా పదునెక్కని కోడికత్తి !

నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఈ పేరు ఇప్పుడు ఏపీ రాజకీయ పార్టీల్లో కలవరం పుట్టిస్తోంది.వైసీపీ అధినేత జగన్ పై విశాఖ ఎయిర్ పోర్ట్ లో కోడి కత్తితో శ్రీనివాసరావు అనే యువకుడు దాడి చేయడం కలకలం రేపింది.ఈ వ్యవవహారం వెనుక టీడీపీ ఉందని పెద్ద ఎత్తున కధనాలు వెలువడ్డాయి.అయితే… వ్యవహారం రాష్ట్ర పరిధిలోనిది కాసేపు… కాదు కాదు కేంద్ర పరిధిలోనిది అని కాసేపు ఇలా అనేక ట్విస్ట్ లు నడిచాయి.అయితే… ఆఖరికి ఈ వ్యవహారం కోర్టు ద్వారా ఎన్ ఐ ఏ కి చేరింది.దీంతో వేగంగా దర్యాప్తు మొదలుపెట్టిన ఈ దర్యాప్తు సంస్థ… ఈ కేసులో నెలకొన్న అనేక చిక్కుముడులను ప్రస్తుతం ఛేదించే పనిలో పడింది.

 Nia Speed Ups Investigation Of Attack On Ys Jagan-TeluguStop.com

దాడికి పాల్పడ్డ నిందితుడు శ్రీనివాస్ ను ఎన్‌.ఐ.ఎ.అధికారులే విచారించే పనిలో పడ్డారు.హైదరాబాద్ లోని మాదాపూర్ ఎన్‌.ఐ.ఎన్‌.ఆఫీస్ లో శ్రీనివాస్ ను ప్రశ్నిస్తున్నారు.

అయితే… ఇప్పటి వరకు జరిగిన విచారణలో.అవే పాత విషయాలను మళ్లీ మళ్లీ చెబుతున్నాడట.జగన్ పై దాడి వ్యవహారంలో తన వెనక ఎవరూ లేరని పదేపదే చెబుతున్నట్టు సమాచారం.అయితే, దాడికి పాల్పడ్డ ముందు కొంతమందితో శ్రీనివాస్ ఫోన్లో మాట్లాడినట్టు గుర్తించారు.

ఇప్పుడు వీరి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.నిందితుడు మాత్రం … ఈ వ్యవహారంలో తన వెనుక ఎవరూ లేరని… నేను చెప్పదలుచుకుంది ఏదో అప్పుడే 11 పేజీల లేఖ…ఆ తరువాత… మరో 22 పేజీలు వేరే లేఖలో రాశానని శ్రీనివాస్ ఎన్.ఐ.ఏ అధికారుల విచారణలో వెల్లడించాడట.తాను మరణించినా ఎలాంటి బాధాలేదనీ, కానీ తాను రాసిన ఆ 22 పేజీల పుస్తకం విడుదల చేయాలంటూ విచారణలో అధికారులను కోరుతున్నాడట.

సెంట్రల్ జైలు సిబ్బంది పుస్తకం లాక్కున్నారనీ, ఏదో ఒకటి చేసి దాన్ని విడుదల చేయండీ అంటూ తనను కలిసిన లాయర్ తో శ్రీనివాస్ చెప్పుకున్నాడట.ఎన్‌.ఐ.ఎ.అధికారులను కూడా శ్రీనివాస్ ఇదే అంశమై పదేపదే అడుగుతున్నట్టు తెలుస్తోంది.శ్రీనివాస్ విచారణకు మరో మూడు రోజులు గడువు మాత్రమే ఉంది.తాజా విచారణలో ఇప్పటి వరకూ కొత్త విషయాలకు సంబంధించి ఎటువంటి సమాచారం సేకరించలేకపోయినట్టు తెలుస్తోంది.ఎన్.ఐ.ఏ ఎంత దూకుడుగా ముందుకు వెళదామని ప్రయత్నిస్తున్నా… వారికి సరైన సహకారం మాత్రం అందడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube