రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి.హైదరాబాద్, నెల్లూరు, తిరుపతితో పాటు సుమారు 60కి పైగా ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
అమరుల బంధుమిత్రుల సంఘం, పౌరహక్కుల సంఘం నేతల ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారు ఎన్ఐఏ అధికారులు.ఈ మేరకు హైదరాబాద్ అల్వాల్ లో భవాని, విద్యానగర్ లో ఐఏపీఎల్ సురేశ్ నివాసంలో తనిఖీలు కొనసాగుతున్నాయి.
అటు నెల్లూరు జిల్లాలోని ఉస్మాన్ సాహెబ్ పేటలో ఎల్లంకి వెంకటేశ్వర్లు, తిరుపతిలో క్రాంతి చైతన్య ఇంటిలో సోదాలు జరుగుతున్నాయి.నెల్లూరు, గుంటూరు, ప్రకాశం జిల్లాతో పాటు శ్రీకాకుళంలో ఎన్ఐఏ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.