మలుపులు తిరుగుతున్న 'కోడి కత్తి' !     2019-01-09   20:42:18  IST  Sai Mallula

వైసీపీ అధినేత జగన్ పై విశాఖ ఎయిర్ పోర్ట్ లో జరిగిన దాడి కేసు అనేక మలుపులు తిరుగుతోంది. అనేక మలుపుల మధ్య ఈ కేసు హాయ్ కోర్టు కి చేరడం…అక్కడి నుంచి ఎన్ ఐ ఏ కు చేరడం… జరిగిపోయింది. అయితే ఎన్ ఐ ఏ దర్యాప్తుకు ఏపీ పోలీసులు సక్రమంగా సహకరించకపోవడం తో ఎన్ ఐ ఏ అధికారులు మరల హై కోర్టు కి వెళ్లిన సంగతి తెలిసిందే.

Nia Recvigestion Pititon In Vijayawada Court-

Nia Recvigestion Pititon In Vijayawada Court

తాజాగా… కోడి కత్తి కేసులో తమకు రికార్డ్‌ ఇప్పించాలని విజయవాడ కోర్టులో ఎన్‌ఐఏ రిక్విజేషన్‌ పిటిషన్‌ వేసింది. కోడికత్తి కేసుపై ఇప్పటికే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని ఎన్ఐఏ కోర్టుకు తెలిపింది. విశాఖలోని 7వ ఏఎంఎం కోర్టు నుంచి రికార్డ్‌ ఇప్పించాలని వినతిపత్రం ఇచ్చింది. డీజీపీ నుంచి అనుమతి రాకపోవడంతో రికార్డ్‌ను ఇవ్వలేకపోతున్నామని కోర్టుకు పోలీసులు తెలిపారు.