కోడి కత్తి కేసు :ఎన్ ఐ ఏ విచారణ ఎదుర్కొన్న వైసీపీ నేతలు     2019-01-19   21:45:37  IST  Sai Mallula

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో ఎన్ ఐ ఏ దర్యాప్తు స్పీడ్ పెంచింది. ఈ కేసులో 10 మంది వైసీపీ నేతలను ప్రశ్నించింది. విశాఖలోని వైసీపీ నేత మళ్ళ విజయప్రసాద్ ఇంట్లో నేతలను ప్రశ్నించారు. జగన్ పై దాడి సమయంలో విమానాశ్రయంలో ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న మొత్తం 10 మంది వైసీపీ నాయకులను విచారించి.. స్టేట్‌మెంట్స్ రికార్డు చేశారు.

Nia Question To Ysrcp Leaders In Jagan Attack Case-

Nia Question To Ysrcp Leaders In Jagan Attack Case

ఎన్‌ఐఏ టీమ్ ప్రశ్నించిన వైసీపీ నేతల్లో మళ్ళ విజయప్రసాద్, ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శీను, పీడిక రాజన్నదొర, తైనాల విజయ్ కుమార్, కరణం ధర్మశ్రీ, కె.కె. రాజు, కొండ రాజీవ్ గాంధీ, తిప్పల నాగిరెడ్డి, సుధాకర్ ఉన్నారు. అలాగే ఈ కేసుకు సంబంధించి మరికొంతమందిని విచారించేందుకు ఎన్ ఐ ఏ సిద్ధం అవుతోంది.