ఐఎస్ఎస్ భారీ కుట్రకి భగ్నం! హైదరాబాద్ లో దొరికిన ఉగ్రవాదులు  

ఐఎస్ఐఎస్ కుట్రని భగ్నం చేసిన ఎన్ఐఎ. హైదరాబాద్ లో ఇద్దరు సానుభూతిపరుల అరెస్ట్. .

Nia Arrested Isis Follower In Hyderabad-nia Arrested. Isis Follower,telangana

ఇన్ని రోజులు అరబిక్ దేశాలని వణికించిన ఐఎస్ఐఎస్ ఉగ్రావాద బూతం ఇండియాలోకి చొరబడిందా. ఇక్కడ ఉగ్రవాద కుట్రలకి తెరతీస్తుందా అంటే అవుననే మాట ఇప్పుడు వినిపిస్తుంది. అరబిక్ దేశాలలో తన బలం కోల్పోతున్న ఐఎస్ ఐఎస్ ఉగ్రవాదులు పాకిస్తాన్ సహాయంతో ఇండియాపై పెత్తనం చేయాలనే ఆలోచనతో ఉన్నారనే ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా ఎప్పటి నుంచో వినిపిస్తుంది..

ఐఎస్ఎస్ భారీ కుట్రకి భగ్నం! హైదరాబాద్ లో దొరికిన ఉగ్రవాదులు-NIA Arrested ISIS Follower In Hyderabad

దీంతో దేశంలో ఉగ్రవాద మూలాలు ఉన్న పోలీసులు నిఘా పెట్టి ఉంచారు. ఈ నేపధ్యంలోనే హైద‌రాబాద్ లో ఐఎస్ఐఎస్ ఉగ్ర‌వాద లింకులు తాజాగా బ‌య‌టప‌డ్డాయి. ఉగ్ర‌వాది బాసిత్ ఇచ్చిన స‌మాచారంతో మైలార్ దేవ్ ప‌ల్లి శాస్త్రిపురంలోని కింగ్స్ కాల‌నీలో ఎనిమిది ఇళ్ల‌లో ఎన్ఐఏ అధికారులు సోదాలు జ‌రిపారు.

ఇక్క‌డి ఓ ఇంట్లో మూడు నెల‌లుగా నివాస‌ముంటున్న తాహన్ అనే యువ‌కుడికి ఐసిస్ తో లింకులు ఉన్న‌ట్లు గుర్తించి అత‌డిని అదుపులోకి తీసుకున్నారు. తాహన్ ఆరు నెల‌ల క్రితం న‌గ‌రానికి వ‌చ్చిన‌ట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఆయ‌న భార్య‌ను కూడా ఎన్ఐఏ విచారించింది.