ఔషధాల ధరల్లో అక్రమాలు: యూకేలో భారత సంతతి వ్యాపారవేత్తపై నిషేధం  

Nhs Price Fixing Uk Amit Patel Banned - Telugu Amit Patel, Indian-origin Pharma Boss Banned From Trade Over Nhs Price Fixing In Uk, Nhs, Uk

ఔషధాల ధరల నిర్ణయంలో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడ్డరన్న ఆరోపణలపై యూకేలో భారత సంతతికి చెందిన ఫార్మా కంపెనీ అధినేత అమిత్ పటేల్ (45) ఐదేళ్ల నిషేధానికి గురయ్యారు.దీని ప్రకారం ఆయన దేశంలోని మరే కంపెనీలోనూ ఐదేళ్ల పాటు డైరెక్టర్ హోదాలో కొనసాగేందుకు వీలుండదు.అమిత్ పటేల్ బ్రిటన్‌లోని ప్రఖ్యాత మెకెంజీ, అమిల్కో ఫార్మాస్యూటికల్ కంపెనీల్లో మాజీ డైరెక్టర్‌.

 Nhs Price Fixing Uk Amit Patel Banned

2014 సెప్టెంబర్ నుంచి 2015 మే నెల వరకు అడెన్ మెకెంజీకి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న కాలంలో కింగ్ ఫార్మాస్యూటికల్స్‌తో కలిసి నార్ట్రిఫ్టిలైన్ ఔషధానికి సంబంధించి ఒక పెద్ద ఫార్మాస్యూటికల్ హోల్‌సేలర్ సరఫరా చేసే విషయంలో అవకతవలకు పాల్పడినట్లు కాంపిటీషన్ అండ్ మార్కెట్స్ అథారిటీ (సీఎమ్‌ఏ) గుర్తించింది.పోటీని పరిమితం చేసుకునే ఉద్దేశ్యంలో భాగంగా ఒక సంస్థ 25 ఎంజీ, మరో సంస్థ 10 ఎంజీ పరిమాణంలో మాత్రమే మాత్రలను తయారు చేసి, పరిమాణం, ధర విషయంలో అవగాహనకు వచ్చాయని దీని వల్ల వినియోగదారులు తీవ్రంగా నష్టపోయారని సీఎంఏ దర్యాప్తులో తేలింది.

అంతేకాకుండా 2016 మార్చి 1 నుంచి అక్టోబర్ 19 వరకు అమిల్కో ఫార్మా డైరెక్టర్‌గా పటేల్ కొనసాగిన సమయంలోనూ ఇలాంటి అక్రమాలకు తెరదీసినట్లు తేలింది.ఈ నేరం కింద అమిత్ పటేల్‌ను దోషిగా తేల్చిన సీఎంఏ ఐదేళ్ల నిషేధం విధించింది.కంపెనీల డైరెక్టర్లకు కాంపిటీషన్ చట్టంలోని నిబంధనలు పాటించాల్సిన బాధ్యత ఉంటుందని ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైఖేల్ గ్రెన్‌ఫెల్ స్పష్టం చేశారు.

ఔషధాల ధరల్లో అక్రమాలు: యూకేలో భారత సంతతి వ్యాపారవేత్తపై నిషేధం-Telugu NRI-Telugu Tollywood Photo Image

రూల్స్ అతిక్రమించిన వారి నుంచి ప్రజలను రక్షించేందుకు సీఎంఏ ముందుకొస్తుందని ఆయన వెల్లడించారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nhs Price Fixing Uk Amit Patel Banned Related Telugu News,Photos/Pics,Images..

footer-test