సమాధానం చెప్పండి : ఎన్‌కౌంటర్‌ పై పోలీసులకు నోటీసులు

దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితుల ఎన్ కౌంటర్ పై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.మెజార్టీ ప్రజలు ఈ ఎన్ కౌంటర్ ను సమర్థిస్తుండగా, కొద్ది మంది మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు.

 Nhrc Issue Notice Telangana Police Disha Accused Encounter-TeluguStop.com

ఏది ఏమైనా ‘దిశ’కు సరైన న్యాయం లభించిందని దేశవ్యాప్తంగా ఆనందం వెల్లువిరుస్తోంది.ఇంతవరకు బాగానే ఉన్నా ఈ కేసులో నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడంపై​ జాతీయ మానవహక్కులు సంఘం (ఎన్‌హెచ్‌​ఆర్‌సీ) స్పందించింది.

దీనిపై మీడియాలో వచ్చిన కథనాలను ఎన్‌హెచ్‌ఆర్‌సీ సుమోటోగా స్వీకరించింది.అంతేకాదు ఈ ఎన్‌కౌంటర్‌పై అత్యవసర దర్యాప్తునకు ఆదేశించింది.

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ను క్షుణ్ణంగా పరిశీలించడానికి తెలంగాణకు నిజనిర్ధారణ కమిటీని పంపాలని ఇన్వెష్టిగేషన్‌ డీజీ కి ఆదేశాలు జారీ చేసింది.నలుగురు నిందితులు పోలీస్‌ కస్టడీలో ఉండగా ఎన్‌కౌంటర్‌ కావడంపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ ఘటనపై తెలంగాణ పోలీసులకు నోటీసులు జారీ చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube