2019లో ఏపీ సీఎం కోసం నాలుగు స్తంభాలాట‌..!

ఏపీలో 2019 ఎన్నిక‌ల వేడి అప్పుడే రాజుకుంది.ఇప్ప‌టికే అధికార టీడీపీ తాజాగా కేబినెట్ ప్ర‌క్షాళ‌న చేసుకుని ఇది వ‌చ్చే ఎన్నిక‌ల కేబినెట్ అంటూ అప్పుడే స‌మ‌ర‌శంఖం పూరించేసింది.

 Next Cm For Ap In 2019 Elections?-TeluguStop.com

ఇక విప‌క్ష వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచి సీఎం కాలేక‌పోతే వైసీపీ 2019 ఎన్నిక‌ల త‌ర్వాత ఉంటుందా ? ఉండ‌దా ? అన్న డౌట్లు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి.ఏపీలో అధికారం కోసం టీడీపీ – వైసీపీతో పాటు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కూడా రంగంలోకి దిగుతున్నాడు.

2019 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పోటీ చేస్తుంద‌ని, తాను ఎమ్మెల్యేగా పోటీ చేసి తీరుతాన‌ని స్ప‌ష్టంగా ప్ర‌క‌టించాడు.ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న‌తో ఏపీలో అధికారం కోసం ట్ర‌యాంగిల్ ఫైట్ త‌ప్ప‌ద‌ని తేలిపోయింది.

ఈ లెక్క‌న 2019 ఎన్నిక‌ల్లో ఏపీ సీఎం రేసులో ప్ర‌స్తుతం సీఎం చంద్ర‌బాబుతో పాటు విప‌క్ష వైసీపీ అధినేత జ‌గ‌న్‌తో పాటు జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ముగ్గురూ ఉంటారు.ఇక ఇప్పుడు ఈ జాబితాలో మ‌రో కీల‌క వ్య‌క్తి చేరారా ? అంటే అవున‌నే ఆన్స‌ర్లే వ‌స్తున్నాయి.

ఎన్టీఆర్ కుమార్తె, మాజీ కేంద్ర‌మంత్రి ద‌గ్గుపాటి పురందేశ్వ‌రి వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ త‌ర‌పున ఏపీ సీఎం రేసులో ఉంటార‌న్న ఊహాగానాలు స్టార్ట్ అయ్యాయి.ఆమె ఇటీవ‌ల ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు మంత్రి ప‌ద‌వులు ఇవ్వ‌డాన్ని నిర‌సిస్తూ మోడీకి లేఖ‌రాశారు.

ఇక వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని బీజేపీ నార్త్‌పై పూర్తిగా సొంత‌కాళ్ల మీద ఎదిగేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో సొంతంగా పోటీ చేయాల‌ని పురందేశ్వ‌రి, కావూరు, క‌న్నా లాంటి సీనియ‌ర్ల‌తో పాటు సోము వీర్రాజు లాంటి వాళ్లు జాతీయ నాయ‌క‌త్వంపై తీవ్ర‌స్థాయిలో ఒత్తిడి చేస్తున్నార‌ట‌.

ఈ క్ర‌మంలోనే టీడీపీని ఈ రెండేళ్ల‌లో ఎలాగోలా వ‌దిలించుకోవాల‌ని బీజేపీ ప్లాన్‌గా తెలుస్తోంది.అందుకే ప‌క్కా వ్యూహంలో భాగంగానే పురందేశ్వ‌రితో ముందుగా టీడీపీని టార్గెట్ చేసే ప్ర‌క్రియ బీజేపీ స్టార్ట్ చేసిన‌ట్టు తెలుస్తోంది.

ఇక ఫిరాయింపుదారుల‌కు మంత్రి ప‌ద‌వులు ఇవ్వ‌డంపై వెంకయ్య నాయుడు కూడా ప‌రోక్షంగా చంద్ర‌బాబును విమ‌ర్శించారు.ఆ వెంట‌నే పురందేశ్వ‌రి మోడీకి లేఖ‌రాశారు.

ఇవ‌న్నీ టీడీపీని సైడ్ చేసే క్ర‌మంలో జ‌రుగుతున్న ప‌రిణామాలు గానే తెలుస్తోంది.పురందేశ్వ‌రిని వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీ బీజేపీ సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టిస్తారని కూడా వార్త‌లు వ‌స్తున్నాయి.

అదే జ‌రిగి బీజేపీ ఏపీలో ఒంట‌రిగా పోటీ చేస్తే ఏపీ సీఎం పీఠం కోసం నాలుగు స్తంభాలాట పోరు చూడొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube